Cinema OTT : ఓటీటీలో దూసుకుపోతున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. విడుదలైన గంటల్లోనే ట్రెండింగ్..

ఓటీటీలో నిత్యం కొత్త కొత్త కంటెంట్ చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. మొన్నటివరకు హార్రర్, సస్పెన్స్ సినిమాలు చూసేందుకు జనాలు ఆసక్తి చూపించారు. కానీ ఇప్పుడు లవ్ స్టోరీ, రొమాంటిక్ ప్రేమకథలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా విడుదలైన గంటల్లోనే దూసుకుపోతుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసుకుందామా.

Cinema OTT : ఓటీటీలో దూసుకుపోతున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. విడుదలైన గంటల్లోనే ట్రెండింగ్..
Mowgli Movie

Updated on: Jan 01, 2026 | 4:32 PM

ప్రముఖ యాంకర్ సుమ తనయుడు టాలీవుడ్ హీరో రోషన్ కనకాల ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ మోగ్లీ. కలర్ ఫోటో మూవీతో జాతీయ అవార్డ్ అందుకున్న డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ ప్రేమకథ ఇటీవలే జనాల ముందుకు వచ్చింది. గతేడాది డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్ హిట్ కాలేకపోయింది. ఇప్పుడు ఇదే సినిమా న్యూయర్ వేడుకల సందర్భంగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. 2026 జనవరి 1 నుంచి ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అలాగే సోషల్ మీడియాలో ఈ మూవీ సీన్స్ తెగ షేర్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..

ప్రతీ హీరో నగరంలోనే పుట్టడు.. కొందరు అడవి నుంచి ఉద్భవిస్తారు.. అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. అనాథగా అడివిలోనే పెరుగుతూ.. అక్కడి ప్రకృతిని తన తల్లిగా భావించే ఒక యువకుడు అనుకోకుండా షూటింగ్ కోసం అడవికి వచ్చిన ఒక మూగ అమ్మాయిలతో ప్రేమలో పడతాడు. వీరిద్దరి కథలోకి ఒక భయంకరమైన పోలీస్ ఆఫీసర్ ఎంటర్ కావడంతో.. ఇద్దరి లైఫ్ ఎలా మలుపు తిరిగింది అనేది సినిమా… తన ప్రేమను కాపాడుకోవడానికి మోగ్లీ ఎలాంటి రిస్క్ చేశాడనేది సినిమాలో చూడొచ్చు. ప్రస్తుతం ఈ మూవీ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి :  Actor Suresh: సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. ఒక్క మాటలో చెప్పేసిన సీనియర్ హీరో..

డిసెంబర్ 13న విడుదలైన సినిమాలో విలన్ పాత్రలో నటించిన బండి సరోజ్ కుమార్ యాక్టింగ్ హైలెట్ అయ్యింది. థియేటర్లలో విడుదలైన కేవలం 17 రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇందులో సాక్షి మడోల్కర్ కథానాయికగా నటించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన మోగ్లీ చిత్రంలో వైవా హర్ష, కృష్ణ భగవాన్ వంటి నటులు కీలకపాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి : Ranu Bombaiki Ranu Song : యూట్యూబ్ సెన్సేషన్.. రానూ బొంబాయికి రాను పాటకు ఎంత అమౌంట్ ఇచ్చారంటే.. డ్యాన్సర్ లిఖిత కామెంట్స్..