Dhamaka OTT: అధికారిక ప్రకటన వచ్చేసింది.. ఆ ఓటీటీలోకే ధమాకా.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..

|

Jan 18, 2023 | 11:37 AM

ధమాకా సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ ప్రియులు. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై అనేక ఊహాగానాలు వచ్చాయి. తాజాగా ఈ ఓటీటీపై అధికారిక ప్రకటన వచ్చేసింది.

Dhamaka OTT: అధికారిక ప్రకటన వచ్చేసింది.. ఆ ఓటీటీలోకే ధమాకా.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..
Dhamaka Ott
Follow us on

ధమాకా సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు మాస్ మాహారాజా రవితేజ. డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఊహించని రితీలో కలెక్షన్స్ రాబట్టింది. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో రవితేజ సరనస పెళ్లి సందD బ్యూటీ శ్రీలీల కథానాయికగా నటించింది. ఈ సినిమా ఇప్పటివరకు దాదాపు రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇందులో రవితేజ ఎనర్జీ.. శ్రీలీల డాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ మూవీతోపాటు.. సాంగ్స్ కూడా యూట్యూబ్‏ను షేక్ చేశాయి. ఇక ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ ప్రియులు. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై అనేక ఊహాగానాలు వచ్చాయి. తాజాగా ధమాకా సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది. ఈ చిత్రాన్ని ఈ నెల 22 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఇక ఈ సినిమాతోపాటే.. రవితేజా మెగాస్టార్ చిరంజీవి.. శ్రుతి హాసన్ కాంబోలో రాబోతున్న వాల్తేరు వీరయ్య చిత్రంలో కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా రేపు (జనవరి 13న) గ్రాండ్ గా విడుదలైంది.

ఇవి కూడా చదవండి

ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.