AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhurandhar 2 OTT: ‘ధురంధర్2’ ఓటీటీ రిలీజ్‌కు లైన్ క్లియర్! 1900 కోట్ల సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ర‌ణ్‌వీర్ సింగ్‌ సింగ్ మూవీ 'ధురంధర్ ది రివేంజ్' (ధురంధర్ 2) ఓటీటీ రిలీజ్ కోసం సినీ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ బ్లాక్ బస్టర్ సినిమా స్ట్రీమింగ్ కు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.

Dhurandhar 2 OTT: 'ధురంధర్2' ఓటీటీ రిలీజ్‌కు లైన్ క్లియర్! 1900 కోట్ల సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Dhurandhar The Revenge Movie
Basha Shek
|

Updated on: May 07, 2026 | 5:31 PM

Share

రణ్ వీర్ సింగ్, ఆధిత్య ధర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ధురంధర్ ది రివేంజ్’ (ధురంధర్ 2) మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో విడుదలై సుమారు ఏడు వారాలు గడిచాయి. అయినా ధురంధర్ 2 జోరు తగ్గలేదు. థియేటర్లలో ఈ సినిమాకు కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా రూ. 1900కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. అయితే మరోవైపు ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్ ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని సినీ ప్రేక్షకులు వేయి కళ్లతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ధురంధర్ 2 సినిమా స్ట్రీమింగ్ ఆలస్యానికి ఒక కారణముందట. ఈ మూవీ క్లైమాక్స్‌లో ‘తిర్చి టోపీవాలే’ సాంగ్ ను రీమిక్స్ చేసి ‘రంగ్ దే లాల్’ పేరుతో వాడారు. దీంతో ఈ సాంగ్ ఉన్న ఉన్న ‘త్రిదేవ్’ సినిమా దర్శకుడు, నిర్మాత రాజీవ్ రాయ్ తన అనుమతి లేకుండా పాటను వాడుకున్నారంటూ ధురంధర్ 2 నిర్మాతలపై ఢిల్లీ హైకోర్టులో కేసు వేశాడు. అయితే ఈ వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది. ప్రస్తుతం ఈ సాంగ్ కు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. త్వరలోనే ఈ వివాదం సమసిపోయే అవకాశముందని తెలుస్తోంది. దీంతో మరికొద్ది రోజుల్లో ధురంధర్ 2 స్ట్రీమింగ్ కు వచ్చే ఛాన్స్ ఉంది.

ఇవి కూడా చదవండి

. సాధారణంగా పెద్ద సినిమాలు థియేటర్లలో విడుదలైన 8 నుంచి 10 వారాల తర్వాతే ఓటీటీలోకి వస్తుంటాయి. ఈ లెక్కన ధురంధర్ 2 సినిమా మే 14 నాటికి థియేటర్లలో రిలీజై ఎనిమిది వారాలను పూర్తి చేసుకుంటుంది. దీనిని బట్టి చూస్తే మే రెండో వారంలో లేదా నెలాఖరులోగా ఈ చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేయనుంది. ధురంధర్ 2 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు జియో హాట్ స్టార్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో మే 15 లేదా 22 తేదీల్లో ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశముంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడవచ్చు. ధురంధర్ ది రివేంజ్ సినిమాలో రణ్‌వీర్ సింగ్ సరసన సారా అర్జున్‌ హీరోయిన్‌గా నటించింది. అలాగే అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్ తదితరులు నటించారు.

2000 కోట్లకు చేరువలో ధురంధర్ ది రివేంజ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి 'బిగ్ బాస్‌' లాగేసుకుంటే..
డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి 'బిగ్ బాస్‌' లాగేసుకుంటే..
ఆదిరెడ్డి చెప్పిందే నిజమవుతుందా.. ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్లేనా?
ఆదిరెడ్డి చెప్పిందే నిజమవుతుందా.. ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్లేనా?
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ