AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhurandhar 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘ధురంధర్ 2’! బ్లాక్ బస్టర్ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

రణ్ వీర్ సింగ్ - ఆదిత్య ధర్ కాంబినేషన్ లో వచ్చిన ధురంధర్ ది రివేంజ్ (ధురంధర్ 2) ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. మార్చి 19న రిలీజైన ఈ సినిమా ఇప్పటికే రూ. 1700 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రూ. 2000 కోట్ల వైపు వేగంగా అడుగులు వేస్తోంది.

Dhurandhar 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'ధురంధర్ 2'! బ్లాక్ బస్టర్ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Dhurandhar 2 Movie
Basha Shek
|

Updated on: Apr 06, 2026 | 5:39 PM

Share

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ ది రివేంజ్’ (ధురందర్ 2) చిత్రం జోరు ఇప్పట్లో ఆగేలా లేదు. మార్చి 19న విడుదలైన ఈ సినిమా దాదాపు మూడు వారాలైనప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఆడుతోంది. ఇప్పటికే రూ.1700 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ రూ. 2000 కోట్ల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. అయితే మొదటి రెండు వారాలతో పోల్చుకుంటే మూడో వారంలో ధురంధర్ 2 కలెక్షన్ల హవా తగ్గిందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమాకు హిందీ, తెలుగు భాషల్లో తప్పితే వేరే లాంగ్వెజెస్ లోనూ పెద్దగా కలెక్షన్లు రావడం లేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా థియేటర్ల సంఖ్య తగ్గింది. ఈ నేపథ్యంలో ధురంధర్ 2 సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కాగా ధురంధర్ 1 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అయితే సీక్వెల విషయంలో ఓటీటీ పార్ట్ నర్ మారినట్లు తెలుస్తోంది.

ధురంధర్ ది రివేంజ్ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాలు థియేటర్లలో విడుదలైన 50 లేదా 60 రోజుల తర్వాతే ఓటీటీలోకి వస్తుంటాయి. ధురంధర్ పార్ట్ 1 విషయంలో కూడా అదే జరిగింది. ఇప్పుడు ‘ధురంధర్ 2’ సాధించిన రికార్డ్ స్థాయి వసూళ్ల నేపథ్యంలో ఈ సినిమా కూడా 50 రోజుల తర్వాతే ఓటీటీలోకి రానుందని సమాచారం. అంటే మే 8 లేదా 15వ తేదీల్లో ఈ బ్లాక్ బస్టర్ మూవీ స్ట్రీమింగ్ కు రావొచ్చని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ ది రివేంజ్ సినిమాలో రణ్ వీర్ సింగ్ సరసన సారా అర్జున్ హీరోయిన్ గా నటించింది. అలాగే అక్షయ్ ఖన్నా, అర్జున్ రామ్ పాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!