OTT Movie: ఓటీటీలో దుమ్మురేపుతోన్న కొత్త సినిమా.. ఏకంగా పాకిస్తాన్‌లోనూ నంబర్‌వన్‌గా ట్రెండింగ్

గతేడాది ఆఖరులో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. భారీ వసూళ్లు రాబట్టి ట్రేడ్ నిపుణులను సైతం ఆశ్చర్యపరిచింది. ఐఎమ్ డీబీలోనూ టాప్ రేటింగ్ సాధించిన ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ లోనూ దుమ్ము దులుపుతోంది.

OTT Movie: ఓటీటీలో దుమ్మురేపుతోన్న కొత్త సినిమా.. ఏకంగా పాకిస్తాన్‌లోనూ నంబర్‌వన్‌గా ట్రెండింగ్
Dhurandhar Movie

Updated on: Feb 03, 2026 | 9:45 AM

రణ్ వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ సినిమాను భారతదేశం నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుండి కూడా అభిమానులు ఆదరిస్తున్నారు. ఈ హై బడ్జెట్ స్పై థ్రిల్లర్ సినిమా డిసెంబర్ 5, 2025న భారతీయ థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఈ సినిమాకు సుమారు రూ.1300 కోట్లకు పైగా వసూలు వచ్చినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు ఈ సినిమా OTTలో విడుదలైంది. జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ధురంధర్ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్‌కి లో సినిమాను చూడలేని వారు, అలాగే మళ్లీ మళ్లీ చూడాలనుకునేవారు ఇప్పుడు ఓటీటీలో ధురంధర్ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో ఉంది. భారతదేశంతో పాటు, పొరుగున ఉన్న పాకిస్తాన్‌లో కూడా ఈ సినిమాను తెగ చూసేస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తర్వాత ధురంధర్ పాకిస్తాన్‌లో నంబర్ 1 ట్రెండ్‌కు చేరుకుంది . ఈ చిత్రాన్ని పాకిస్తాన్‌లోని థియేటర్లలో విడుదల చేయడం సాధ్యం కాలేదు. సోషల్ మీడియాలో వైరల్ అయిన స్క్రీన్‌షాట్‌లను బట్టి, పాకిస్తాన్‌లోని ప్రజలు ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో పెద్ద సంఖ్యలో చూస్తున్నారని స్పష్టంగా తెలుస్తుంది. పాకిస్తాన్‌లో నెట్‌ఫ్లిక్స్ ట్రేడింగ్ జాబితాలో ధురంధర్ అగ్రస్థానంలో ఉంది.

ధురంధర్ సినిమా పాకిస్తాన్‌లో అధికారికంగా విడుదల కాలేదు. ఈ సినిమా కథ పాకిస్తాన్ ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల చుట్టూ తిరుగుతుంది. ఇందులో హీరో పాకిస్తాన్‌లో స్పై ఏజెంట్ గా చేరి వారి ఉగ్రవాద నెట్‌వర్క్ గురించి సమాచారాన్ని సేకరిస్తాడు. అందుకే పాకిస్తాన్ తో పాటు ఇస్లామిక్ దేశాలలలో ఈ సినిమా విడులపై నిషేధం విధించారు. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ గూఢచారి పాత్రలో నటించాడు. అక్షయ్ ఖన్నా రెహమాన్ డకైట్ అనే పాత్రలో అదరగొట్టారు. ఈ రెండు పాత్రలు ప్రేక్షకులకు బాగా నచ్చాయి. అలాగే అర్జున్ రాంపాల్, సారా అర్జున్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, సారా అర్జున్ తదితరు ఈ చిత్రంలో తమ బలమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు

ఇవి కూడా చదవండి

కాగా థియేటర్లలో ధరందర్ సినిమా రన్‌టైమ్ 3 గంటల 34 నిమిషాలు కాగా నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా రన్‌టైమ్ 3 గంటల 25 నిమిషాలు మాత్రమే. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 1300 కోట్లు వసూలు చేసింది. భారతదేశంలో ఈ సినిమా రూ. 1000 కోట్ల మార్కును దాటింది. ఈ సినిమా రెండవ భాగం మార్చి 2026లో విడుదల కానుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి