RGV Dhahanam: రామ్‌గోపాల్ వర్మ సంచనాలకు పెట్టింది పేరు. ఈ దర్శకుడి నుంచి ఓ సినిమా వస్తుందంటే చాలు అంచనాలతో పాటు కాంట్రవర్సీలూ ఉంటాయి. సినిమా టైటిల్ ప్రకటించింది మొదలు విడుదల వరకు నిత్యం ఒక వార్త హల్చల్ చేస్తూనే ఉంటుంది. వర్మ దర్శకత్వం వహించిన సినిమాలే కాకుండా నిర్మాతగా వ్యవహరించిన చిత్రాలు సైతం కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా నిలుస్తుంటాయి. ఇలా వర్మ ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుల్లో అగస్త్య మంజు ఒకరు. ప్రస్తుతం ఇతని డైరెక్షన్‌లోనే ‘దహనం’ అనే వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఎమ్‌ఎక్స్ ప్లేయర్‌లో ఏప్రిల్ 14 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ వర్మ కొన్ని రోజుల క్రితం ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ‘ఎక్కడ హింస ముగుస్తుందో అక్కడ దహనం మొదలవుతుంది’ అంటూ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు.
ఇదిలా ఉంటే తాజాగా చిత్ర యూనిట్ ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ ట్రైలర్‌ను గమినిస్తే సిరీస్ మొత్తం పగా, ప్రతీకారం నేపథ్యంలో తెరకెక్కినట్లు కనిపిస్తోంది. తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని తపించే ఓ కొడుకు కథలా కపిస్తోంది. తన తండ్రిని చంపిన వారిపై కొడుకు పగను ఎలా తీర్చుకున్నాడనేదే వెబ్ సిరీస్ కథాంశంగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ ట్రైలర్‌ను గమనిస్తుంటే వర్మ గతంలో తెరకెక్కించిన ‘రక్త చరిత్ర’ను పోలినట్లుంది. వర్మ మరోసారి పరిటాల కుటుంబ నేపథ్యంగా వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారా? అన్న అనుమానం కలగక మానదు. అయితే ఈ విషయాన్ని వర్మకానీ, చిత్ర యూనిట్ కానీ ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం.
ఎక్కడ హింస ముగుస్తుందో అక్కడ దహనం మొదలవుతుంది
ఏప్రిల్ 14 నుంచి @mxplayer లో స్ట్రీమ్ అవ్వబోతున్న నరాలు తెగే ఉత్కంఠ కలిగించే ఈ వెబ్ సీరీస్ sneak peak ఇక్కడ చూడండిhttps://t.co/r8Bo1bEU74 pic.twitter.com/bzwId1v8RW
— Ram Gopal Varma (@RGVzoomin) April 1, 2022
మరి ఈ కథ కేవలం కల్పితమా.. లేదా నిజంగా జరిగిన కథాంశమా తెలియాలంటే సిరీస్ విడుదల వరకు వేచి చూడాల్సిందే. ఇక పూర్తి యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన ఈ సిరీస్ మొత్తం ఏడు ఎపిసోడ్‌లుగా స్ట్రీమింగ్ కానుంది. ఇషా కొప్పికర్, అభిషేక్, నైనా గంగూలీ, అశ్వత్ కాంత్ శర్మ, అభిలాష్ చౌదరి, పార్వతి అరుణ్, సయాజీ షిండే, ప్రదీప్ రావత్‌లు కీలక పాత్రల్లో నటించారు. మరి ఈ ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి..
Also Read: గుడ్‌న్యూస్.. పాన్-ఆధార్ అనుసంధానం గడువు పొడిగింపు.. కానీ..
Astro: శనిదోషాలతో ఇబ్బందిపడుతున్నారా.. ఇలా చేస్తే అంతా శుభమే..!
Dangerous Shark: ఆ నదిలో ప్రమాదకరమైన సొరచేప.. కొరికిందంటే క్షణాల్లో మరణం..!