AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : ఓటీటీలో హారర్ థ్రిల్లర్ సంచలనం.. భయం పుట్టించే సీన్స్.. అయినా తెగ చూస్తున్న జనాలు.. తెలుగులోనూ స్ట్రీమింగ్..

మీరు హారర్ సినిమా ప్రియులా.. ? భయం పుట్టించే కథలను చూసేందుకు మీరు ఆసక్తిగా ఉన్నారా.. ? అయితే మీకోసమే ఈ సినిమా. ఆద్యంతం ఊహించని సీన్స్, మలుపులతో సాగే ఓ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. నిజానికి హాలీవుడ్ సినిమా అయినప్పటికీ తెలుగులోనూ మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆ చిత్రాన్ని ఇప్పుడు జియో హాట్ స్టార్ లో చూడొచ్చు.

Cinema : ఓటీటీలో హారర్ థ్రిల్లర్ సంచలనం.. భయం పుట్టించే సీన్స్.. అయినా తెగ చూస్తున్న జనాలు.. తెలుగులోనూ స్ట్రీమింగ్..
Pumpiknhead
Rajitha Chanti
|

Updated on: Jul 10, 2026 | 8:02 AM

Share

ప్రస్తుతం ఓటీటీ వేదికలలో సరికొత్త కంటెంట్ చిత్రాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. కానీ హారర్ సినిమాలకు ఉండే డిమాండ్ మాత్రం అస్సలు తగ్గదు. నిత్యం ఏదోక హారర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరోవైపు కొన్ని చిత్రాలు విడుదలై నెలలు, సంవత్సరాలు గడిచినప్పటికీ క్రేజ్ తగ్గడం లేదు. భయానక కథలు రచించి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంద అభిమానులను సొంతం చేసుకున్న రచయిత ఆర్ఎల్ స్టైన్. ఆయన సృష్టించే హారర్ సిరీస్ పుస్తకాలు, సినిమాలు యావత్ సినీ ప్రపంచాన్ని అలరించాయి. ఇప్పటికే ఎన్నో కథలను రచించారు. అందులో ఒక నవల ఆధారంగా తెరకెక్కించిన ఫాంటసీ హారర్ థ్రిల్లర్ మూవీ ఆర్ఎల్ సైన్స్ పంపికిన్ హెడ్. గతేడాది అక్టోబర్ నెలలో నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన వచ్చింది. ఇక ఇప్పుడు మరో ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యింది.

ఎక్కువమంది చదివినవి : OTT Cinema : ఓటీటీలో గత్తరలేపుతున్న సినిమా.. ఒక్కో ట్విస్టు చూస్తే మతిపోవడం ఖాయం భయ్యా.. థ్రిల్లర్ ప్రియులకు సూపర్ ఛాయిస్..

ఈ సినిమా ప్రస్తుతం జియో హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, హిందీ, తమిళం భాషలలో ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకోచ్చారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇందులోని ట్విస్టులు, సీన్స్ ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి ఫాంటసీ, వింత రాక్షసులు, అడ్వెంచర్ కథలను ఇష్టపడే వారికి మాత్రం ఈ సినిమా పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.

ఎక్కువమంది చదివినవి : Anushka Shetty : ఆ సినిమాతో ఆయనకు పేరు వచ్చింది.. కానీ డబ్బులు రాలేదు.. అనుష్క కామెంట్స్..

కథ విషయానికి వస్తే..

తండ్రి అకాల మరణం తర్వాత సామ్ (బీన్ రీడ్) తన తల్లి, అన్నయ్య నిక్ తో కలిసి ఒక కొత్త ఊరికి మారిపోతాడు. కొత్త వాతావరణంలో ఒంటరితనంతో బాధపడే సామ్, కాస్త అల్లరి చేయడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలోనే ఊరిలో అందరూ ఎంతో రహస్యంగా, పవిత్రంగా భావించే ఒక గుమ్మడికాయను దొంగిలిస్తాడు. తమ్ముడు చేసిన తప్పు తెలుసుకున్న అన్నయ్య నిక్.. దానిని తిరిగి ఇచ్చేయడానికి వెళ్లి అదృశ్యమవుతాడు. అక్కడి నుంచి సినిమా మలుపులు తిరుగుతుంది. నిక్ అనే అబ్బాయి ఉన్నట్లు అసలు ఆ ఊర్లో ఎవరికి గుర్తుండదు. కానీ తన అన్నయ్య అదృశ్యం వెనుక ఉన్న భయంకరమైన శాపం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుకు క్రురమైన దిష్టిబొమ్మ రాక్షసుడితో పోరాటం చేయాల్సి ఉంటుంది. తర్వాత సామ్ జీవితం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది అనేది సినిమా.

ఎక్కువమంది చదివినవి : Tollywood: చాలా టార్చర్ చేశారు.. ట్రైన్‏లో నుంచి దూకి సూసైడ్ చేసుకుందాం అనుకున్నా.. బిగ్ బాస్ బ్యూటీ..

ఎక్కువమంది చదివినవి : నవ్వులు పంచిన నటుడి జీవితంలో విషాదం.. గుండు హనుమంతరావు కొడుకును దత్తత తీసుకున్న స్టార్ ఎవరంటే..

Follow Us