Pawan Kalyan: అన్‏స్టాపబుల్ స్పెషల్ గ్లింప్స్ వేరేలెవల్.. పవన్, బాలయ్యను ఆటాడుకున్న డైరెక్టర్ క్రిష్..

ఈ లాస్ట్ ఎపిసోడ్ ఈరోజు రాత్రి స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా ఆహా పవర్ స్టార్ ఎపిసోడ్ కు సంబంధించి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేసింది.

Pawan Kalyan: అన్‏స్టాపబుల్ స్పెషల్ గ్లింప్స్ వేరేలెవల్.. పవన్, బాలయ్యను ఆటాడుకున్న డైరెక్టర్ క్రిష్..
Pawan Kalyan

Updated on: Feb 09, 2023 | 5:57 PM

నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యతగా వ్యవహరిస్తోన్న ఈ అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 2 సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు విచ్చేసి వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ఇటీవలే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సైతం మొదటిసారి టాక్ షోకు విచ్చేసి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విచ్చేసిన ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతోంది. కొద్దిరోజులుగా డిజిటల్ సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎపిసోడ్ పవన్ కళ్యాణ్ అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే. ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతున్న ఫస్ట్ ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. ఇక ఈ ఎపిసోడ్ సెకండ్ పార్ట్ కోసం వేయి కళ్లతో చూస్తున్నారు మెగా అభిమానులు. ఈ లాస్ట్ ఎపిసోడ్ ఈరోజు రాత్రి స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా ఆహా పవర్ స్టార్ ఎపిసోడ్ కు సంబంధించి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేసింది.

అందులో పవన్ కళ్యాణ్ తోపాటు.. డైరెక్టర్ క్రిష్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో హరి హర వీరమల్లు సినిమా తెరకెక్కుతుంది. తాజాగా విడుదలైన వీడియోలో పవన్ ను.. బాలయ్యను కొన్ని సరదా ప్రశ్నలతో ఆటపట్టించాడు క్రిష్. అయితే ఆయన అడిగే ప్రశ్నలకు పవన్ నవ్వుతూనే సమాధానాలు చెప్పేశారు.

ఇవి కూడా చదవండి

అలాగే ఇందులో పవన్ తన రాజకీయ జీవితానికి సంబంధించిన పలు అంశాలు కూడా పార్ట్ 2లో బయటపెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ స్పెషల్ గ్లింప్స్ ఆకట్టుకుంటుంది. కాగా పార్ట్ 2 ఎపిసోడ్ ముందుగా ప్రకటించిన దానికంటే ఒకరోజు ముందే అనగా ఫిబ్రవరి 9న ప్రసారం చేయనున్నారు. ఈ పార్ట్ 2 నేడు రాత్రి 9 గంటల నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.