తెలుగు ప్రేక్షకులకు అభిమాన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ పేరు చెబితే మెగా అభిమానులకు వైబ్రేషన్స్. ఆయన సినిమాలో కోసం వేయి కళ్లతో ఎదురుచూసే ఫ్యాన్స్.. ఆయన రాజకీయ స్పీచ్ కోసం గంటల తరబడి వెయిట్ చేస్తుంటారు. ఎప్పుడూ ఎలాంటి టాక్ షోలలో పాల్గొనని పవర్ స్టార్.. మొట్ట మొదటిసారి నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యతగా వ్యవహరిస్తోన్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే 2 షోలో పాల్గొన్నారు. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రావడంతో భారీ వ్యూస్ సంపాదించుకున్న ఈ షో.. ఇప్పుడు పవర్ స్టార్ రావడంతో ఒక్కసారిగా రికార్డ్స్ సృష్టిస్తోంది. సెకండ్ సీజన్ ఇప్పుడు ముగింపుకు చేరుకుంది. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఈ సీజన్ ఫైనల్. ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది. త్వరలోనే సెకండ్ ఎపిసోడ్ కూడా స్ట్రీమింగ్ కాబోతుంది. అయితే ఇప్పటివరకు ఎక్కడా ఎవరితోనూ పంచుకుని మాటలను అన్ స్టాపబుల్ వేదికపై బయటపెట్టారు పవన్. సినిమాలు.. రాజకీయాలు మాత్రమే కాకుండా.. వ్యక్తిగత విషయాలను కూడా బాలయ్య ముందు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన ఎపిసోడ్ లాస్ట్ ప్రోమోలో పవన్ .. తాను అనుభవించిన డిప్రెషన్… ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడం గురించి తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో లేని సమయంలో ఆయన తుపాకీతో సూసైడ్ చేసుకోవాలనుకున్నారట.
అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే 2 సీజన్ లాస్ట్ ఎపిసోడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ది. ఇప్పటికే స్ట్రీమింగ్ అయిన ఫస్ట్ ఎపిసోడ్ లో పవన్ మూడు పెళ్లిళ్ల గురించి క్లారిటీ ఇచ్చారు. తేజ్ యాక్సిడెంట్… పెళ్లిళ్లు గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. ఇప్పుడు సెకండ్ పార్ట్ లో పవన్ సూసైడ్ ఎందుకు చేసుకోవాలనుకున్నారో చెప్పారు. “చిన్నతనంలో నాకు ఎప్పుడు అనారోగ్యాంగానే ఉండేది. ఎప్పుడూ ఉబ్బసం సమస్యతో ఆసుపత్రిలో ఉండేవాడిని. దీంతో ఒంటరిగా ఉండడం అలవాటు అయ్యింది. నేను ఎనిమిదవ తరగతి నుంచి పరీక్షలలో ఫెయిల్ కావడం వల్ల ఇంటర్ పరీక్షలు తప్పినా అంతగా నిరుత్సాహపడలేదు. దీంతో సెప్టెంబరులో ప్రయత్నించాను.
అప్పుడు కూడా పాస్ కావడం అసాధ్యమని అర్థమయ్యింది. ఫ్రెండ్స్ అంతా జీవితంలో ముందుకు వెళ్తున్నారు. మనం ఉన్న చోటే ఉన్నాం. ఫెయిల్ అవుతున్నా ఇంట్లో వాళ్లు ఏం అనలేదు. ఎప్పుడూ పరీక్షల తాలుకూ ఒత్తిడి నన్ను వెంటాడేది. దీంతో ఆ సమయంలో ఒత్తిడికి గురయ్యి.. ఆత్మహత్యకు ప్రయత్నించాను. అన్నయ్య చిరంజీవి ఇంట్లో లేని సమయంలో ఆయన రివాల్వర్ తీసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేశాను. కుటుంబసభ్యులు చూడడంతో బతికిపోయాను. అన్నయ్య నాగబాబు, సురేఖ వదిన నన్ను చూసి కాపాడారు. నాకు అండగా నిలిచారు.. నువ్వు చదవకపోయిన మేం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం. జీవితంలో స్పష్టత ముఖ్యం.. ముందు ఏం కావాలనుకుంటున్నావో నిర్ణయించుకో అని సలహా ఇచ్చారు”
ఈ విషయం తెలుసుకున్న మా అన్న (చిరంజీవి) నాతో నా కోసం జీవించు. నువ్వు ఏమీ చేయకున్నా ఫర్వాలేదు. కానీ దయచేసి జీవించు’ అని చెప్పాడు. అప్పటి నుంచి పుస్తకాలు చదవడం, కర్నాటక సంగీతం, మార్షల్ ఆర్ట్‌లు, ఇతర వ్యాపకాలతో ఓదార్పు పొందాను’’ అని పవన్ చెప్పారు. ప్రస్తుతం పవన్ ఎంతోమందికి స్పూర్తిదాయకం.
మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోకండి, మీతో మీరు మాత్రమే పోటీ పడండి అని పవన్ ఈ షోలో అన్నారు. “విజ్ఞానం, విజయం హార్డ్ వర్క్‌తో మీకు అన్ని వస్తాయి, ఈ రోజు మనం భరించేది మన రేపటిని రూపొందిస్తుంది. మీరెప్పుడు ఉత్తమ సంస్కరణగా ఉండండి.” అంటూ చెప్పుకొచ్చారు పవన్. ఈ సెకండ్ ఎపిసోడ్ ఫిబ్రవరి 10న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.