Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అన్‏స్టాపబుల్ గ్లింప్స్ వచ్చేసింది.. బాలయ్యతో అదరగొట్టేస్తోన్న పవర్ స్టార్..

ఇక ఇప్పుడు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎపిసోడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తొలిసారి పవన్ డిజిటల్ ప్లాట్ ఫాంపై కనిపించబోతున్నారు. అది కూడా బాలయ్యతో కలిసి. దీంతో వీరి ఎపిసోడ్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అన్‏స్టాపబుల్ గ్లింప్స్ వచ్చేసింది.. బాలయ్యతో అదరగొట్టేస్తోన్న పవర్ స్టార్..
Pawan Kalyan, Balakrishna

Updated on: Jan 20, 2023 | 9:05 PM

నందమూరి నటసింహాం బాలకృష్ణ హోస్ట్‏గా అదరగొట్టేస్తో్న్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ మాద్యమం ఆహాలో ఆయన యాంకరింగ్ చేస్తోన్న అన్‏స్టాపబుల్ సీజన్ 2కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన స్నేహితుడు గోపిచంద్‏తో కలిసి సందడి చేశారు. వీరి ఎపిసోడ్‏కు వచ్చిన వ్యూస్ గురించి చెప్పక్కర్లేదు. ఇక ఇప్పుడు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎపిసోడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తొలిసారి పవన్ డిజిటల్ ప్లాట్ ఫాంపై కనిపించబోతున్నారు. అది కూడా బాలయ్యతో కలిసి. దీంతో వీరి ఎపిసోడ్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. పవర్ స్టార్ ను బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నారు ?.. పవన్ ఎలా రియాక్ట్ కాబోతున్నారనేది తెలుసుకోవడానికి అభిమానులతో క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఇప్పటికే పవన్ ఎపిసోడ్ షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. తాజాగా శుక్రవారం సాయంత్రం ఈ ఎపిసోడ్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసింది ఆహా. బాలయ్య.. పవన్ ఓకే వేదికపై సరదాగా చూడడానికి రెండు కళ్లు సరిపోవడం లేదన్నట్లుగా గ్లింప్స్ ఉంది.

తాజాగా విడుదలైన గ్లింప్స్ వీడియోలో పవన్ కళ్యాణ్ అదరగొట్టేయబోతున్నారని తెలుస్తోంది. వీడియో మొదట్లో తనను బాల అని పిలవాలని కోరగా.. మరోసారి ఓడిపోవడానికి సిద్ధం కానీ అలా మాత్రం పిలవనంటూ నవ్వులు చిందించారు. దీంతో ఈ పాలిటిక్స్ యే వద్దు అనేసారు బాలయ్య. అలాగే మెగాస్టార్ చిరంజీవి నుంచి నేర్చుకున్నవి ఏంటీ ?.. వద్దనుకున్నవి ఏంటీ ? అంటూ ప్రశ్నించారు. అలాగే రాజకీయాల గురించి కూడా ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మొత్తానికి ఈ షోలో ప్రేక్షకులకు కావాల్సిన సమాధానాలను పవన్ స్టార్ నుంచి రాబట్టినట్లుగా తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా తెలుస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.