Parampara Season 2: ‘నిజాన్ని ఎక్కువ కాలం ఎవడూ దాయలేడు’.. ఉత్కంఠభరితంగా పరంపరా సీజన్‌ 2 ట్రైలర్‌..

|

Jul 08, 2022 | 5:06 PM

Parampara Season 2: శరత్‌ కుమార్‌, జగపతి బాబు, నవీన్‌ చంద్ర కీలక పాత్రల్లో తెరకెక్కిన వెబ్‌ సిరీస్‌ పరంపర. డిస్నీ+ హాట్‌స్టార్‌ వేదికగా విడుదలైన ఈ వెబ్‌ సిరీస్‌కు విశేష స్పందన వచ్చింది. తాజాగా ఈ వెబ్‌ సిరీస్‌కు...

Parampara Season 2: నిజాన్ని ఎక్కువ కాలం ఎవడూ దాయలేడు.. ఉత్కంఠభరితంగా పరంపరా సీజన్‌ 2 ట్రైలర్‌..
Follow us on

Parampara Season 2: శరత్‌ కుమార్‌, జగపతి బాబు, నవీన్‌ చంద్ర కీలక పాత్రల్లో తెరకెక్కిన వెబ్‌ సిరీస్‌ పరంపర. డిస్నీ+ హాట్‌స్టార్‌ వేదికగా విడుదలైన ఈ వెబ్‌ సిరీస్‌కు విశేష స్పందన వచ్చింది. తాజాగా ఈ వెబ్‌ సిరీస్‌కు సీక్వెల్‌గా ‘పరంపర సీజన్‌2’ తెరకెక్కింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ వెబ్‌ సిరీస్‌ జులై 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచింది. ఇందులో భాగంగానే తాజాగా వెబ్‌ సిరీస్‌ టీజర్‌ను విడుదుల చేసింది. మొదటి పార్ట్‌ ఎంతటి ఉత్కంఠతను రేకెత్తించిందో సీజన్‌2లో అంతకంటే ఇంట్రెస్టింగ్‌ అంశాలు ఇందులో ఉండేలా కనిపిస్తోంది.

1.28 నిమిషాల నిడివి ఉన్న పరంపర సీజన్‌2 ట్రైలర్‌ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. ముఖ్యంగా ట్రైలర్‌లో వచ్చే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. ‘ఈ యుద్ధం ఎవరి కోసం మొదలుపెట్టావో గుర్తుంది కానీ.. ఎందుకోసం మొదలుపెట్టావో గుర్తులేదు’. ‘స్వేచ్ఛ కోసం. మా నాన్న దగ్గర లాక్కున్న అధికారం.. పోగొట్టుకున్న పేరు.. కోల్పోయిన జీవితం.. అన్నీ తిరిగి కావాలి’, ‘నాయకుడు అధికారాన్ని కోరుకోవడం కాదు. అధికారమే నాయకుడ్ని వెతుకుంటూ వస్తుంది’, ‘నిజాన్ని ఎక్కువ కాలం ఎవడూ దాయలేడు’ అనే డైలాగ్‌లను ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఆదిపత్య పోరు, రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్‌ ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..