Maa Neela Tank : బుట్టబొమ్మ చేతుల మీదుగా అక్కినేని యంగ్ హీరో వెబ్ సిరీస్ ట్రైలర్..

అక్కినేని యంగ్ హీరో సుశాంత్(Sushanth)చాలా కాలంగా సరైన హిట్ లేక సతమతం అవుతున్నాడు. సోలో హీరోగా సినిమాలు చేస్తున్నప్పటికీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేక పోయాడు. దాంతో సెకండ్ హీరో అవతారమెత్తాడు.

Maa Neela Tank : బుట్టబొమ్మ చేతుల మీదుగా అక్కినేని యంగ్ హీరో వెబ్ సిరీస్ ట్రైలర్..
Akkineni Sushant 'ma Nilla
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 09, 2022 | 7:44 AM

అక్కినేని యంగ్ హీరో సుశాంత్(Sushanth)చాలా కాలంగా సరైన హిట్ లేక సతమతం అవుతున్నాడు. సోలో హీరోగా సినిమాలు చేస్తున్నప్పటికీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేక పోయాడు. దాంతో సెకండ్ హీరో అవతారమెత్తాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురంలో సినిమాలో సెకండ్ హీరోగా కనిపించి మెప్పించాడు సుశాంత్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పటికీ సుశాంత్ కు బ్రేక్ రాలేదు. ఇక ఇప్పుడు మాస్ రాజా రవితేజ నటిస్తున్న రావణాసుర సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ కుర్ర హీరో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నాడు. మా నీళ్ల ట్యాంక్ అనే ఇంట్రస్టింగ్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ వెబ్ సిరీస్ కు లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సుశాంత్ రాయలసీమ యాసలో మాట్లాడనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సిరీస్ కు సంబంధించిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా మా నీళ్ల ట్యాంక్ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ను బుట్టబొమ్మ పూజాహెగ్డే రిలీజ్ చేసింది. వంశీ అనే పోలీసాఫీసర్ పాత్రలో సుశాంత్ కనిపించాడు. చాలా కాలం తర్వాత ప్రియా ఆనంద్ తెలుగులో నటిస్తుంది. ట్రైలర్ చాలా హీలేరియన్స్ గా అనిపించింది. ఈ వెబ్ సిరీస్ తో సుశాంత్ మంచి క్రేజ్ తెచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రేమ్ సాగర్ – నిరోషా – బిగ్ బాస్ దివి – అన్నపూర్ణమ్మ – రామారాజు – అప్పాజీ అంబరీశ్ – బిందు చంద్రమౌళి – సందీప్ వారణాసి – లావణ్య రెడ్డి ఇతరపాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ జులై 15 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?