Parampara 2: కరోనా మహమ్మారి కారణంగా వినోద రంగంలోనూ మార్పులు వచ్చాయి. ఒకప్పుడు వెబ్ సిరీస్‌లు అంటే కేవలం హాలీవుడ్‌లో ఎక్కువగా కనిపించేవి కానీ ప్రస్తుతం తెలుగులోనూ వెబ్ సిరీస్‌ల హవా నడుస్తోంది. ముఖ్యంగా ఓటీటీ మార్కెట్ పెరగడంతో ఈ ట్రెండ్‌కు బాగా కలిసొచ్చిందని చెప్పాలి. ప్రేక్షకులు సైతం వెబ్ సిరీస్‌లకు జై కొడుతున్నారు. వెబ్ సిరీస్‌లకు సీక్వెల్స్ కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో వెబ్ సిరీస్ సీక్వెల్ ప్రేక్షకులను పలకరించడానికి వస్తోంది. గతేడాది ప్రేక్షకులను ఆకట్టుకున్న వెబ్ సిరీస్‌లలో ‘పరంపర’ ఒకటి. డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా విడుదలైన ఈ వెబ్ సిరీస్‌కు మంచి ఆదరణ లభించింది.
నవీన్ చంద్ర, జగపతిబాబు, శరత్‌కుమార్, ఆకాంక్షసింగ్, ఇషాన్ వెంకటేశ్ కీలక పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ పగ, ఆధిపత్యపోరు నేపథ్యంలో తెరకెక్కింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ వెబ్ సిరీస్‌కు సీక్వెల్ విడుదల కానుంది. ‘పరంపర2’ జూలై 21న అందుబాటులోకి రానుంది. బాహుబలి చిత్రాన్ని తెరకెక్కించి ఆర్కా మీడియా వర్క్స్ ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించడం కూడా దీనిపై మంచి బజ్ ఏర్పడడానికి కారణంగా చెప్పవచ్చు. ‘పగ కోసం ఎంత దూరం వెళ్లారో తెలియాలంటే పరంపరా 2’ చూడాల్సిందే అంటూ చిత్ర యూనిట్ సీక్వెల్ విడుదల తేదీని ప్రకటించింది. ప్రేక్షకులు సైతం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ వెబ్ సిరీస్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాయో చూడాలి.
How far does one go for revenge?
It’s to find out on #ParamparaAgain!Get ready for #ParamparaSeason2. Premieres July 21 on @DisneyPlusHS.@iamjaggubhai @realsarathkumar @naveenc212 @aakanksha_s30 @yoursishan @NainaGtweets @muralimohanmp @KrishnaVijayL @shobu_ @arkamediaworks pic.twitter.com/IrLKic28W1
— Arka Mediaworks (@arkamediaworks) June 24, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..