18 Pages OTT: ఓటీటీలోకి వచ్చేసిన నిఖిల్‌- అనుపమల ప్రేమకథ.. 18 పేజెస్ సినిమా ఎక్కడ చూడొచ్చంటే?

|

Jan 27, 2023 | 7:31 AM

నిఖిల్‌- అనుపమల అందమైన ప్రేమకథ ఓటీటీలోకి వచ్చేసింది. కాగా ఈ సినిమా డిజిటల్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థలు ఆహా, నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకున్నాయి. థియేటర్‌ రన్‌ పూర్తి కావడంతో గత అర్ధరాత్రి నుంచి 18 పేజెస్‌ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది.

18 Pages OTT: ఓటీటీలోకి వచ్చేసిన నిఖిల్‌- అనుపమల ప్రేమకథ.. 18 పేజెస్ సినిమా ఎక్కడ చూడొచ్చంటే?
18 Pages Ott
Follow us on

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్ద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ’18 పేజెస్‌’. కరెంట్, కుమారి 21F లాంటి ఫీల్‌ గుడ్‌ లవ్‌ స్టోరీస్‌ను తెరకెక్కించిన పల్నాటి సూర్యప్రతాప్‌ ఈ అందమైన ప్రేమకథను తెరకెక్కించారు. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్ 23న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద డీసెంట్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్‌ దగ్గర మంచి వసూళ్లు సాధించింది. తద్వారా కార్తికేయ 2 లాంటి పాన్‌ ఇండియా హిట్‌ తర్వాత నిఖిల్‌- అనుపమ జోడీ ఖాతాలో మరో హిట్‌ వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో యూత్‌ను బాగా ఆకట్టుకున్న 18 పేజెస్‌ సినిమా డిజిటల్‌ రిలీజ్‌ కోసం అందరూ ఆసక్తికగా ఎదురుచూశారు. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడింది. నిఖిల్‌- అనుపమల అందమైన ప్రేమకథ ఓటీటీలోకి వచ్చేసింది. కాగా ఈ సినిమా డిజిటల్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థలు ఆహా, నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకున్నాయి. థియేటర్‌ రన్‌ పూర్తి కావడంతో గత అర్ధరాత్రి నుంచి 18 పేజెస్‌ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది.

18 పేజెస్‌ సినిమాను జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించారు. అల్లు అరవింద్‌ సమర్పకుడిగా వ్యవహరించారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథను అందించారు. నవీన్‌ నూలి ఎడిటర్‌ బాధ్యతలు నిర్వర్తించారు. గోపి సుందర్ అందమైన బాణీలు సమకూర్చాడు. ఇందులోని ‘నన్నయ్య రాసిన’ అనే పాట ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంది. నిఖిల్‌- అనుపమలతో పాటు ఈ సినిమాలో అజయ్‌, దినేశ్‌, పోసాని కృష్ణమురళి, బ్రహ్మాజీ, సరయు, మౌనికా రెడ్డి తదితరులు నటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.