SPY OTT: నిఖిల్‌ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌.. సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘స్పై’.. ఎక్కడ చూడొచ్చంటే?

|

Jul 27, 2023 | 7:43 AM

ED ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్‌పై కే.రాజశేఖర్ రెడ్డి నిర్మించిన స్పై మూవీలో ఐశ్వర్య మేనన్‌ హీరోయిన్‌గా నటించగా, దగ్గుబాటి రానా, ఆర్యన్‌ రాజేష్‌ స్పెషల్‌ రోల్స్‌ పోషించారు. జూన్‌29న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ యావరేజ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్‌ వద్ద మోస్తరు కలెక్షన్లను సొంతం చేసుకుంది.

SPY OTT: నిఖిల్‌ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌.. సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన స్పై.. ఎక్కడ చూడొచ్చంటే?
Nikhil Spy Movie
Follow us on

కార్తికేయ 2, 18 పేజెస్‌ లాంటి హిట్‌ సినిమాల తర్వాత యంగ్ హీరో నిఖిల్‌ నటించిన చిత్రం స్పై. స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్‌ చంద్రబోస్‌ డెత్ మిస్టరీ ఆధారంగా గ్యారీ బీహెచ్ ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ను తెరకెక్కించారు. ED ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్‌పై కే.రాజశేఖర్ రెడ్డి నిర్మించిన స్పై మూవీలో ఐశ్వర్య మేనన్‌ హీరోయిన్‌గా నటించగా, దగ్గుబాటి రానా, ఆర్యన్‌ రాజేష్‌ స్పెషల్‌ రోల్స్‌ పోషించారు. జూన్‌29న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ యావరేజ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్‌ వద్ద మోస్తరు కలెక్షన్లను సొంతం చేసుకుంది. అయితే ఎప్పటిలాగే నిఖిల్‌ నటన అలరించింది. అలాగే సినిమాలో యాక్షన్‌ సీక్వెన్స్‌ ఓ రేంజ్‌లో ఉన్నాయని రివ్యూస్‌ వచ్చాయి. ఈ క్రమంలో థియేటర్లలో ఓ మోస్తరుగా ఆకట్టుకున్ స్పై మూవీ సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో నిఖిల్‌ స్పై మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది.

అయితే ఎలాంటి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్ లేకుండానే గురువారం (జులై 27) నుంచి ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసిందీ లేటెస్ట్‌ యాక్షన్ థ్రిల్లర్‌. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్‌, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్పై సినిమా అందుబాటులోకి ఉంది. ఈ మూవీలో సాన్య ఠాకూర్, తనికెళ్ల భరణి, మరకంద్ దేశ్‌పాండే,  జిషు సేన్ గుప్తా నితిన్ మెహతా తదితరులు కీలక పాత్రలో పోషించారు. శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్ స్వరాలు సమకూర్చారు. సో.. మరి థియేటర్లలో స్పై మూవీని మిస్‌ అయిన వారు లేదా మళ్లీ ఇంకోసారి చూడాలనుకునే వారు ఎంచెక్కా ఇంట్లోనే ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..