దసరా వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని నటించిన చిత్రం హాయ్ నాన్న. డైరెక్టర్ శౌర్యువ్ తెరకెక్కించిన ఈ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌లో సీతారామం బ్యూటీ మృణాళ్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. శ్రుతి హాసన్ మరో కీలక పాత్రలో మెరిసింది. డిసెంబర్ 7న థియేటర్లలో విడుదలైన హాయ్ నాన్న సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. తండ్రీ కూతుళ్ల అనుబంధానికి, అందమైన ప్రేమకథను జోడించి శౌర్యువ్ అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించారు. జెర్సీ తర్వాత తండ్రి పాత్రలో మరోసారి ఒదిగిపోయాడు హీరో నాని. అలాగే మృణాళ్ అందం, అభినయం అందరినీ కట్టిపడేసింది. ఇక నాని కూతురు మహీ పాత్రలో బేబి కియారా ఖన్నా నటన కన్నీళ్లు తెప్పించింది. దీంతో ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు సగటు సినీ ప్రేమికులు హాయ్ నాన్న సినిమాకు ఫిదా అయ్యారు. థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పించిన నాని సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. హాయ్ నాన్న సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. గురువారం (డిసెంబర్ 4) నుంచే నాని సినిమాను ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించింది. కాబట్టి ఇవాళ అర్ధ రాత్రి నుంచే హాయ్ నాన్న సినిమా ఓటీటీలోకి రానుంది.
తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లోకి అందుబాటులోకి రానుంది హాయ్ నాన్న. వైరా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి హాయ్ నాన్న సినిమాను నిర్మించారు. ఖుషి మూవీ ఫేమ్ హేషమ్ అబ్దుల్ వాహబ్ నాని సినిమాకు సంగీతం అందించారు. కోలీవుడ్ నటుడు జయరాం, సీనియర్ నటి మీరా జాస్మిన్, బాలీవుడ్ నటుడు అంగద్ బేడీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మరి థియేటర్లలో నాని సినిమాను మిస్ అయ్యారా? లేదా మళ్లీ చూడాలనుకుంటున్నారా? అయితే నెట్‌ఫ్లిక్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి.
We can’t wait to say Hi to Viraj, Yashna and Mahi tomorrow! 👋🥰#HiNanna streaming from tomorrow on Netflix in Telugu, Tamil, Malayalam, Kannada, & Hindi. pic.twitter.com/m2kiRJxA66
— Netflix India South (@Netflix_INSouth) January 3, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.