
ఎన్టీఆర్ బావ మరిది నార్నే నితిన్ ‘మ్యాడ్’ మూవీతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. తాజాగా ఈ యంగ్ హీరో ఆయ్ అంటూ మరో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అంజి కె మణిపుత్ర తెరకెక్కంచిన ఈ సినిమాలో నయన్ సారిక హీరోయిన్ గా నటించింది. రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, గోపి, సురభి ప్రభావతి, వినోద్ కుమార్, శ్రీనివాస్ వడ్లమాని తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఆయ్ సినిమాను నిర్మించారు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. బరిలో స్టార్ హీరోల సినిమాలున్నా తట్టుకుని మరీ నిలబడి భారీ కలెక్షన్లు సాధించింది. పల్లెటూరి వాతావరణంలో సాగే ఈ స్వచ్చమైన ప్రేమకథను చూసి సామాన్యులతో పాటు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రష్మిక మందన్న వంటి సెలబ్రిటీలు కూడా మెచ్చుకున్నారు. ఇప్పటికీ థియేటర్లలో సందడి చేస్తున్న ఆయ్ సినిమాకు సంబంధించి ఓటీటీ రిలీజ్ పై అప్డేట్ వచ్చింది. ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మూవీ ’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
కాగా ప్రస్తుతం థియేటర్లలో ఆయ్ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో థియేట్రికల్ వెర్షన్ రిలీజైన సుమారు ఆరు వారాల తర్వాతే ఈ మూవీ ఓటీటీలోకి రానుందని సమాచారం. అంటే సెప్టెంబర్ మూడో వారం లేదా నాలుగో వారంలో ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని సమాచారం. కాగా ఆయ్ సినిమా 14 రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలూ కలిపి రూ. 7.53 కోట్లు షేర్, రూ. 15.50 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసుకుంది. ఈ సినిమాకు రామ్ మిరియాల అందించిన స్వరాలు చార్ట్ బస్టర్ గా నిలిచాయి. ముఖ్యంగా రంగనాయకి సాంగ్ కు యూట్యూబ్ షేక్ అవుతోంది.
ఆ ఒక్క మాటతో!!!#AAYMovie‘s hilarious scenes are entertaining audiences throughout😆🔥#AAYFunFestival in Cinemas Now💥
Book Your Tickets Now:https://t.co/5kgQiTC0GG pic.twitter.com/TdbfTchB3n
— GA2 Pictures (@GA2Official) August 30, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.