- Telugu News Photo Gallery Cinema photos Aha Telugu Indian Idol Season 3 highlights on 31 august 2024 Telugu Entertainment Photos
Indian Idol Season 3: ఈ వారం ఎంటర్‌టైన్‌మెంట్ డబుల్ ధమాకా.! తమన్ సీక్రెట్స్ లీక్..
దీపావళికి పేలుస్తాం పటాకా.. ఈ వారం ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది డబుల్ ధమాకా.. యస్.. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో డబుల్ ధమాకా విత్ ప్లేబ్యాక్ సింగర్స్ స్పెషల్ ఎపిసోడ్ ఈవారం ప్రసారం కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రోమో జనాలను యమాగా అట్రాక్ట్ చేస్తోంది. అందులోనూ స్పెషల్ గెస్ట్ తమన్ గురించి చెప్పిన సంగతులు ఇన్‌స్టంట్‌గా వైరల్ అవుతున్నాయి.
Updated on: Aug 31, 2024 | 7:27 PM

దీపావళికి పేలుస్తాం పటాకా.. ఈ వారం ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది డబుల్ ధమాకా.. యస్.. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో డబుల్ ధమాకా విత్ ప్లేబ్యాక్ సింగర్స్ స్పెషల్ ఎపిసోడ్ ఈవారం ప్రసారం కానుంది.

ఈ వారం ఎపిసోడ్‌లు పండగలాగా ముస్తాబయ్యాయి. మన సంస్కృతిని ప్రతిబింబించే సంప్రదాయ వేషధారణలో కంటెస్టంట్లు కూడా మెప్పించారు. ఆహా ఇండియన్ ఐడల్ సీజన్స్ లో ఇంతకు ముందెప్పుడూ జరగనంతగా రేస్ టు ఫినాలే మొదలైందని జడ్జిలు చెబుతుంటే ఆడియన్స్ కి గూస్‌బంప్స్ వచ్చేశాయి.

ఫినాలే సమరం మొదలైంది... టాప్ ఫైవ్‌లో ప్లేస్ కోసం స్వర యుద్ధం జరుగుతోంది.. ఇక్కడ నిలిచేది ఎవరు? నిలిచి గెలిచేది ఎవరు? ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నుంచి ఆల్రెడీ ప్రశంసలు అందుకున్నది ఎవరు.?

తెలియాలంటే ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 లో ఈ వారం ఎపిసోడ్ అస్సలు మిస్ కావద్దు. ఈ వారం ఎపిసోడ్ ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పేస్తోంది ప్రోమో..!

ఈ వారం ఎపిసోడ్‌లో సూపర్ ఉమెన్‌గా ఎంట్రీ ఇచ్చారు తమన్ తల్లి. ఎంతో పుణ్యం చేసుకుంటే ఇలాంటి కొడుకు పుట్టాడని కాంప్లిమెంట్స్ ఇస్తూనే, తమన్ చిన్నతనంలో చేసిన అల్లరి గుట్టువిప్పేశారు సూపర్ మదర్.

తమన్ సీక్రెట్స్ రివీల్ అయిన ఈ ఎపిసోడ్‌ని అస్సలు మిస్ కాకూడదనే ఫీల్ కలిగిస్తోంది ప్రోమో. జస్ట్ అంతే కాదు.. యామిని వేసిన స్టెప్పులు, మహేష్ పాటకు కార్తిక్ చేసిన డ్రాయింగ్, బంతిపూల బుట్టను గీతా డ్రా చేసిన తీరు..

ఇలాంటివి ఎన్నెన్నో చూసి వినోదాన్ని ఆస్వాదించాలంటే అస్సలు మిస్ కాకూడదు ఈ వారం ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ ఎపిసోడ్స్. ఆగస్టు 30, 31 సాయంత్రం ఏడు గంటలకు తప్పక చూడండి.. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఎపిసోడ్స్.




