
న్యాచురల్ స్టార్ నాని.. టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ కాంబోలో వచ్చిన లేటేస్ట్ చిత్రం శ్యామ్ సింగరాయ్. కలకత్తా బ్యాగ్రౌండ్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. పిరియాడిక్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీలో నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. నిహారిక నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాను తెలుగుతోపాటు.. తమిళ్, కన్నడ భాషలలో విడుదలైన మంచి టాక్ అందుకుంది. మరోవైపు ఈ సినిమా థియేటర్ల వద్ద భారీగా కలెక్షన్స్ రాబడుతుండగా.. మరోవైపు శ్యామ్ సింగరాయ్ సాంగ్స్ యూట్యూబ్‌లో దూసుకుపోతున్నాయి.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైనట్టుగా టాక్. తాజాగా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేశారట. ఈ చిత్రాన్ని జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా శ్యామ్ సింగరాయ్ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్స్ చేయాలని భావిస్తున్నారట మేకర్స్. తెలుగులోనే కాకుండా… తమిళంలోనూ శ్యామ్ సింగరాయ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందట. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనుంది చిత్రయూనిట్. ప్రస్తుతం నాని.. అంటే సుందరానికి సినిమా చేస్తున్నాడు. అంటే సుందరానికీ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతోంది నజ్రియా నజిమ్ ఫహాద్. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Also Read: Anupama Parameswaran : ఎర్రచీరలో కిర్రెక్కిస్తున్న కుర్రది.. అందాల అనుపమ లేటెస్ట్ ఫొటోస్..
Rowdy Boys: సంక్రాంతి కానుకగా రానున్న రౌడీ బాయ్స్.. మూవీ ట్రైలర్ లాంచ్ చేసే స్టార్ హీరో ఎవరంటే..
Sonusood: కీలక నిర్ణయం తీసుకున్న సోనూసూద్.. ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన..