Balakrishna AHA Talk Show: తొలి తెలుగు ఓటీటీ ఆహా టాక్ షోలతో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఓటీటీ రంగంలో టాక్ షోలను తీసుకొచ్చిన సంస్థగా ఆహా అరుదైన ఘనత దక్కించుకుంది. ఇందులో భాగంగానే తొలిసారి సమంతతో సామ్ జామ్ షోను నిర్వహించిన ఆహా.. ఈసారి ఏకంగా నందమూరి బాలకృష్ణను రంగంలోకి దింపుతోంది. బాలయ్య బాబు ఒక హోస్ట్‌గా వ్యవహరిస్తుండడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక నవంబర్ 4 నుంచి ప్రసారం కానున్న తొలి ఎపిసోడ్‌లో బాలకృష్ణ ఎవరిని ఇంటర్వ్యూ చేయనున్నారన్న దానిపై ఆసక్తి నెలకొని ఉంది.
ఇక తాజాగా ఈ షో లాంచ్ వేడుక నిర్వహించారు. ఇందులో ఆహా వ్యవస్థాపకుల్లో ఒకరైన అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ షోకి సంబంధించి మరో ఆసక్తికరమైన అంశంపై చర్చ జరుగుతోంది. అదే ఈ షో కోసం బాలయ్య తీసుకోనున్న రెమ్యునరేషన్. బాలయ్య బాబు ఈ షో కోసం ఎపిసోడ్‌కు ఏకంగా రూ. 40 లక్షలు తీసుకోనున్నాడనేది సదరు వార్త సారంశం. తొలి సీజన్‌లో 12 ఎపిసోడ్‌లు ఉండనున్నట్లు సమాచారం. అంటే ఎంత కాదన్నా ఈ షో కోసం బాలకృష్ణ రూ. 5 కోట్లు తీసుకోనున్నట్లు చర్చ జరుగుతోంది.
మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇప్పటి వరకు సినిమాల్లో తన పంచ్ డైలాగ్‌లతో ఆకట్టుకున్న బాలకృష్ణ ఇంటర్వ్యూలతో ఏమేర ఆకట్టుకుంటారో చూడాలి.
Also Read: ప్రేమంటే ఇదే.. అప్యాయంగా ఫారెస్ట్ ఆఫీసర్‌ను కౌగిలించుకున్న పిల్ల ఏనుగు.. హత్తుకుంటున్న ఫోటో..
Viral Video: ఆకాశం నుంచి దూసుకొచ్చిన మృత్యువు.. అదృష్టం బాగుండి.. !! వీడియో