యంగ్ హీరో నాగశౌర్య.. రీతూవర్మ జంటగా నటించిన లేటేస్ట్ చిత్రం వరుడు కావలెను. డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 29న విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో నాగశౌర్య నటనకు మంచి మార్కులే పడ్డాయి. బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ సంపాదించుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరించనుంది.
ఈచిత్రాన్ని జనవరి 7 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో నాగశౌర్య.. ఆకాష్ పాత్రలో నటించగా.. రీతూవర్మ.. భూమి పాత్రలో ఆకట్టుకుంది. ఈ సినిమాలోని సాంగ్స్ యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ సినిమాలో నదియా, మురళీశర్మ, వెన్నెల కిశోర్, ప్రవీణ్, హర్ష వర్ధన్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఇక నాగశౌర్య ప్రధాన పాత్రలో నటించిన లక్ష్య సినిమా డిసెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆశించనంత హిట్ కాలేకపోయింది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్‌గా నటించగా.. జగపతి బాబు కీలక పాత్రలో కనిపించాడు. ఈ చిత్రానికి సంతోష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు.
Also Read: RRR Song: ఆ పాటను కాపీ చేశారా ? ఆర్ఆర్ఆర్ కొమురం భీముడో సాంగ్ పై నెటిజన్స్ అసహనం..
ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సరికొత్త రికార్డ్.. 24 గంటల్లో అత్యధికంగా వీక్షించిన ట్రైలర్‌గా గుర్తింపు
Bangarraju Movie: షూటింగ్ పూర్తి చేసిన బంగార్రాజు.. త్వరలోనే ప్రమోషన్స్ పై దృష్టి పెట్టనున్న టీమ్..