ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫారమ్స్ ఆదరణ ఎక్కువగా పెరిగిపోయింది. ఇప్పటివరకు సస్పెన్స్ థ్రిల్లర్స్, సూపర్ హిట్ చిత్రాలను అందించిన ఓటీటీ సంస్థలు… ఇప్పుడు టాక్ షోస్ కూడా తీసుకువస్తున్నాయి. ఇప్పటికే తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా నిర్వహిస్తోన్న అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే 2 టాక్ షో ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో చెప్పక్కర్లేదు. నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యతగా వ్యవహరిస్తోన్న ఈ టాక్ షో మొదటి సీజన్ భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న సెకండ్ సీజన్ కూడా ఊహించని స్థాయిలో రెస్పాన్స్ అందుకుంటుంది. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాకతో ఒక్కసారిగా క్రేజ్ మారిపోగా.. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది. పవన్ ఎపిసోడ్ సీజన్ 2కు చివరిది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు తాజాగా సింగర్ స్మిత కూడా త్వరలో నిజం విత్ స్మిత్ అనే టాక్ షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సెలబ్రెటీల వ్వక్తిగత, కెరియర్ విషయాల గురించి ఈ షోలో ప్రస్తావించనున్నారు. అయితే ఈ షో మెగాస్టార్ చిరంజీవితో ప్రారంభం కాబోతుంది. ఈ మేరకు తాజాగా ఓ ప్రోమో కూడా విడుదలైంది. ఇప్పటివరకు చిరు గురించి తెలిసినవి కాకుండా.. తెలియని విషయాలతోపాటు.. అనేక ప్రశ్నలకు సమాధానాలు రాబట్టినట్లుగా తెలుస్తోంది.
తాజాగా విడుదలైన ప్రోమోలో.. స్టార్ డమ్ అనేది కొంతమందికే సాధ్యం అవుతుంది. ఆ స్టేజీకి వెళ్లడానికి ఎన్నో అవమానాలు పడి ఉంటారు. అవునా ? అని స్మిత అడగ్గా.. చిరు స్పందిస్తూ.. జగిత్యాలలో నాపై నుంచి పూల వర్షం కురిసింది. కొంత ముందుకు వెళ్లగానే నాపై కోడిగుడ్లు విసిరారు అంటూ తను ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు చిరు. అయితే ఎప్పుడూ బయటపెట్టని విషయాన్ని ఇప్పుడు చిరు చెప్పడంతో అసలు ఆయనపై కోడిగుడ్లు ఎందుకు విసిరారు ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ విషయానికి క్లారిటీ రావాలంటే ఫుల్ ఎపిసోడ్ చూడాలి. అలాగే చిరును స్మిత అడిగిన ప్రశ్నలు.. మెగాస్టార్ చెప్పిన ఆన్సర్స్ గురించి తెలుసుకోవాలంటే.. ఫిబ్రవి 10న ప్రసారమయ్యే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే. ప్రస్తుతం చిరంజీవి భోళా శంకర్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో తమన్నా, కీర్తి సురేష్ కీలకపాత్రలలో నటిస్తున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.