మోసగాళ్లు తర్వాత భారీ గ్యాప్ తీసుకున్న మంచు విష్ణు జిన్నాగా ప్రేక్షకుల ముందుకువచ్చాడు. ఈషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ హీరోయిన్లుగా నటించారు. సైకలాజికల్ థ్రిల్లర్‌కు కాస్త కామెడీని జోడించి వినోదాత్మకంగా ఈ సినిమాను తీర్చిదిద్దారు. తెలుగుతో పాటు హిందీ, మలయాళ భాషల్లో అక్టోబర్ 21న థియేటర్లలో విడుదలైన జిన్నా సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే రోటీన్ స్టోరీ కావడంతో ఆశించిన మేర కలెక్షన్లను రాబట్టలేకపోయింది. కానీ సినిమాలోని కామెడీ సీన్లు, విష్ణు నటన, పాయల్, సన్నీ లియోన్ అందచందాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడీ సినిమా డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆకట్టుకున్న జిన్నా ఓటీటీలోనైనా హిట్ కొట్టేద్దామని వచ్చేస్తున్నాడు.
జిన్నా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. డిసెంబర్ 2 నుంచి సినిమా స్ట్రీమింగ్ కానుందని తెలిసింది. పేరుకు శుక్రవారం అని చెప్పినా… గురువారం (అనగా ఈ రోజు) రాత్రి నుంచి ఓటీటీలో సినిమా వీక్షకులకు అందుబాటులోకి వస్తుంది. కాగా ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు నాగేశ్వర రెడ్డి కథను అందించగా, కోన వెంకట్ స్ర్కీన్‌ప్లే సమకూర్చారు. ఏవీఏ ఎంటర్‌టైన్ మెంట్, యూనివర్సల్ స్టూడియోలతో కలిసి 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై ప్రముఖ నటుడు మోహన్ బాబు ఈ సినిమాను నిర్మించారు. జిన్నా సినిమాలో అన్నపూర్ణమ్మ, రఘు బాబు, సీనియర్ నరేష్, సునీల్, వెన్నెల కిశోర్, చమ్మక్ చంద్ర, సద్దాం తదితరులు ఇతరులు నటించారు. ఈ సినిమాతో తన కుమార్తెలు అరియానా – వివియానాను సింగర్స్‌గా పరిచయం చేశారు విష్ణు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.
The endlessly entertaining movie is all set to entertain you on @PrimeVideoIN ? from tomorrow.
Just a day to go and full-on entertainment #GINNA!#GinnaOnPrime In Telugu & Malayalam.@iVishnuManchu @SunnyLeone @starlingpayal @avaentofficial @24FramesFactory @saregamasouth pic.twitter.com/9Jn2rESSH0
— AVA Entertainment (@avaentofficial) December 1, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..