OTT Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న మలయాళీ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

ప్రస్తుతం ఓటీటీల్లో మలయాళీ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఎలాంటి అంచనాలు, హడావిడి లేకుండా థియేటర్లలో విడుదలైన చిన్న సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. కొన్నాళ్లుగా మలయాళీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో మూవీ ఓటీటీ సినీప్రియులను ఆకట్టుకునేందుకు వస్తున్నాయి.

OTT Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న మలయాళీ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Pendulum Ott

Updated on: May 20, 2025 | 9:29 PM

ఇటీవల కాలంలో ఓటీటీలో హారర్, సస్పెన్స్ , మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మలయాళంలో గత రెండేళ్ల క్రితం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఓ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఎప్పుడో రెండేళ్ల కిందట అంటే జూన్ 2023లో థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఓటీటీ మూవీ లవర్స్ ముందుకు రాబోతుంది. అదే పెండులమ్. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో ఈ సినిమా తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. మే 22 నుంచి ఈ మూవీ అందుబాటులోకి రానుందని అధికారికంగా ప్రకటించారు.

“మీ కలలు మీకు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది.. ? అసలు నిజమేదో, భ్రమేదో తెలుసుకోలేని ఓ గ్రిప్పింగ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీని చూసేందుకు సిద్ధంగా ఉండండి. పెండులమ్ తెలుగులో మే 22 నుంచి ప్రీమియర్ కానుంది. కేవలం ఈటీవీ విన్ లో” అనే క్యాప్షన్ తో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అనౌన్స్ చేశారు మేకర్స్. రెజిన్ బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ బాబు, అనుమోల్, ప్రకాష్ బారేలాంటి తదితరులు కీలకపాత్రలు పోషించారు.

డాక్టర్ మహేష్ నారాయణన్ అనే వ్యక్తి చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుంది. తన జీవితంలో జరిగిన ఓ అసాధారణ ఘటన గురించి తెలుసుకోవాలని అతడు చేసే ప్రయత్నమే ఈ సినిమా. కేవలం 1 గంట 46 నిమిషాల వ్యవధి ఉన్న ఈ సినిమా ఆద్యంతం ఉత్కంఠతో సాగుతుంది. థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.

ఇవి కూడా చదవండి :  

Genelia : ఆ ఒక్కటి తినడం మానేసిందట.. 37 ఏళ్ల వయసులో జెనీలియా ఫిట్నెస్ రహాస్యం ఇదే..

Tollywood: రస్నా యాడ్‏లో కనిపించిన ఈ చిన్నారి రాజమౌళీ సినిమాలో హీరోయిన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..?

Tollywood: అప్పుడు ఐశ్వర్య రాయ్‏కే చెమటలు పట్టించింది.. కట్ చేస్తే.. ఇప్పుడు సన్యాసిగా మారిన హీరోయిన్..

Suriya : 100 రోజుల్లోనే సిక్స్ ప్యాక్.. 49 ఏళ్ల వయసులో కుర్రాడిలా సూర్య.. డైట్ ప్లాన్ చెప్పిన హీరో..