OTT Movie: ఓటీటీ ఆడియెన్స్‌ను భయపెడుతోన్న నిజమైన దెయ్యం సినిమా.. తెలుగులోనూ IMDB టాప్ రేటింగ్ హారర్ థ్రిల్లర్

ఇటీవల నిజ జీవిత సంఘటనలు, వ్యక్తుల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ హారర్ థ్రిల్లర్ సినిమా కూడా కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆడియెన్స్ ను బాగా భయపెట్టింది.

OTT Movie: ఓటీటీ ఆడియెన్స్‌ను భయపెడుతోన్న నిజమైన దెయ్యం సినిమా.. తెలుగులోనూ IMDB టాప్ రేటింగ్ హారర్ థ్రిల్లర్
OTT Movie

Updated on: Oct 03, 2025 | 8:38 PM

ఈ వారంలో ఓటీటీలో పలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగు సినిమాలతో పాటు వివిధ భాషలకు చెందిన చిత్రాలు, సిరీస్ లు కూడా వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సందడి చేస్తున్నాయి. అయితే ఇందులో ఒక హారర్ థ్రిల్లర్ సినిమా మాత్రం ఓటీటీ ఆడియెన్స్ ను తెగ భయపెడుతోంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో టాప్ ట్రెండ్ లో దూసుకెళుతోంది. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. రూ.5 కోట్ల బ‌డ్జెట్‌లోనే రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద రూ. 30 కోట్ల వ‌ర‌కు రాబ‌ట్టింది. ఆసక్తికరమైన కథా కథనాలు, ఆద్యంతం ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు, ఊహించని ట్విస్టులు ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించాయి. ఐఎమ్ డీబీలోనూ ఈ హారర్ థ్రిల్లర్ మూవీకి టాప్ రేటింట్ దక్కడం విశేషం. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కేరళలోని తిర‌వ‌నంత‌పురం సమీపంలోని ఓ మారుమూల గ్రామం చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతంది. ఆ ఊరి ప్రజలు రాత్రి అయితే చాలు బయటకు రావాలంటే తెగ భయపడిపోతుంటారు. ముఖ్యంగా అడ‌వి మ‌ధ్య‌లో ఉన్న‌సుమ‌తి మ‌లుపును దాట‌డానికి జంకుతుంటారు. అయితే కొందరు మాత్రం తమకేం కాదని ధైర్యంగా ఆ మలుపు దగ్గరకు పోతారు. కానీ వాళ్లకు వింత ఘటనలు ఎదరవుతాయి. అక్క‌డే సృహా కోల్పోయి ఆస్పత్రుల పాలవుతుంటారు. దీంతో ఎవ‌రూ మలుపు దగ్గరకు వెళ్లేందుకు సాహసించరు.

ఇదే గ్రామంలో వీడియో లైబ్ర‌రీ నడుపుకునే అప్పు ఆ ఊరి స్కూల్‌లో ప‌ని చేసే భామ‌ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ గ‌తంలో త‌మ ఇంటి పెద్ద బిడ్డ కనిపించకుండా పోవడానికి అప్పునే కార‌ణం అని భామ వాళ్ల ఫ్యామిలీ అప్పుపై ఆగ్ర‌హంతో ఉంటుంది. భామ‌కు మ‌రో అబ్బాయితో పెళ్లి ఫిక్స్ చేస్తారు. స‌రిగ్గా అదే స‌మ‌యంలో అప్పు షాప్‌లో ప‌ని చేసే ఒక మ‌హిళ త‌న బిడ్డ‌తో పాటు ఆత్మ‌హ‌త్య‌ చేసుకుంటుంది. దీంతో అప్పుచిక్కుల్లో పడతాడు. మరి ఆ తర్వాత అతను ఏం చేశాడు? భామ అక్క మిస్సింగ్ లో అప్పును ఎందుకు అనుమానించారు? ఇంతకీ అక్కడ జరిగే వింత సంఘటనలకు అప్పుకు సంబంధమేంటి? అనే విషయం తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

కేరళలోని తిరువనంత పురం స‌మీపంలోని మైలమూడు ప‌రిస‌ర గ్రామాల్లో గతంలో జరిగిన కొన్ని రియ‌ల్ ఇన్సిడెంట్ల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా పేరు సుమతి వలవు. ఇదేదో సినిమా కోసంపెట్టిన పేరు కాదు. అది నిజంగా ఇప్ప‌టికీ ఆ ప్రాంతంలో ఉంది. ‘సుమ‌తి వ‌ల‌వు’ అంటే తెలుగులో ‘సుమ‌తి మ‌లుపు’ అని అర్థం. ఇప్పుడీ చిత్రం జీ5 ఓటీటీలో మ‌ల‌యాళంతో పాటు తెలుగు ఇత‌ర భాష‌ల్లోనూ స్ట్రీమింగ్ అవుతుంది.

ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో సుమతి వలవు..

&

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.