OTT Movie: ఆఫీస్ బాత్రూమ్‌లో బాస్ మర్డర్.. ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు

ప్రస్తుతం ఓటీటీలో మలయాళ సినిమాలు, వెబ్ సిరీస్ ల హవా నడుస్తోంది. ముఖ్యంగా హారర్, క్రైమ్, థ్రిల్లర్, సస్పెన్స్ జానర్ సినిమాలకు బాగా ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు మనం చెప్పుకునే సినిమా కూడా ఓ మలయాళం క్రైమ్ థ్రిల్లర్. అద్దిరిపోయే ట్విస్టులున్న ఈ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

OTT Movie: ఆఫీస్ బాత్రూమ్‌లో బాస్ మర్డర్.. ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
OTT Movie

Updated on: Oct 29, 2025 | 6:01 PM

ఓటీటీలో అన్ని రకాల సినిమాలు ఉంటాయి. అయితే ఈ మధ్యన క్రైమ్, హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలకు మంచి ఆదరణ ఉంటోంది. భాషతో సంబంధం లేకుండా ఈ జానర్ సినిమాలను చూసేస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా ఓ డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్. కొన్ని నెలల క్రితం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలాగే ఓటీటీలోనూ సంచలనం సృష్టించింది. ఆకకట్టుకునే కథా కథనాలు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, అద్దిరిపోయే ట్విస్టులు కచ్చితంగా మంచి థ్రిల్ అందిస్తాయని చెప్పువచ్చు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వ‌ర‌కు నెక్స్ట్ ఏం జ‌రుగుతుందోనని ఆద్యంతం క్యూరియాసిటీని క‌లిగించేలా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే..ఇసాక్ జాన్ అనే వ్యక్తి కొంత మంది ఉద్యోగులను ఎంపిక చేసుకుని  వీ టెక్ అనే కంపెనీని నిర్వహిస్తుంటాడు. ఒకరోజు అతను ఊహించని విధంగా అనుమానాస్పద రీతిలో శవమై కనిపిస్తాడు. అది కూడా ఆఫీస్ బాత్ రూమ్ లో. అందులోనూ డెడ్ బాడీ ఉన్న గదికి లోపల నుంచే లాక్ వేసి ఉంటుంది. రంగంలోకి దిగిన పోలీసులు ఇదొక యాక్సిడెంటల్ డెత్ అని అంచనాకు వస్తారు. ప్రమాదవశాత్తు కింద పడి తలకు గాయమై చనిపోయాడేమోనని భావిస్తారు.

అదే సమయంలో మరో సీనియర్ పోలీసాఫీసర్ ఈ కేసును టేకప్ చేస్తాడు. అతనికి ఇది అసలు ప్రమాదమే కాదు, హత్య అనే అనుమానం కలుగుతుంది. దీంతో తనదైన శైలిలో విచారణ మొదలు పెడతాడు. ముందుగా ఇషాక్ ఆఫీస్‌లో ప‌నిచేస్తోన్న వారిని అనుమానిస్తాడు. ఈ నేపథ్యంలో సంచలన నిజాలు వెలుగులోకి వస్తాయి. మరి అసలు జాన్ ను ఎవరు హత్య చేశారు? ఎందుకు చేశారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

అద్యంతం ఉత్కంఠ భరిత సన్నివేశాలు, ట్విస్టులతో సాగే ఈ సినిమా పేరు గోళం. ఈ సినిమా క్లైమాక్స్ ఓ రేంజ్ లో ఉంటుంది. ట్విస్ట్ లు మాత్రం ఊహించలేరు. ప్రస్తుతం ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూడాలనుకునేవారికి గోళం ఒక మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.

తెలుగులోనూ స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.