సుమారు నాలుగేళ్ల క్రితం (2019) విడుదలైన ఫ్యామిలీ ఓరియంటెడ్ వెబ్ సిరీస్ మేడ్ ఇన్ హెవెన్. అప్పుడప్పుడే వెబ్ సిరీస్‌లు ప్రారంభం అవుతున్న తరుణంలో రిలీజైన మేడ్ ఇన్ హెవెన్ సిరీస్ అందరినీ ఆకట్టుకుంది. తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ల ఇందులో కీ రోల్ పోషించడం విశేషం. మొదటి సిరీస్‌ను అద్భుతమైన ట్విస్ట్‌తో ముగించారు మేకర్స్. దీంతో సెకెండ సీజన్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఓటీటీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. ఇప్పుడీ నిరీక్షణకు తెరదించారు మేకర్స్. మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ఆగస్టు 10 నుంచి ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2 నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ వెబ్‌సిరీస్ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఫస్ట్ సీజన్‌లో లాగానే ఈ పార్ట్‌లో కూడా.. మెహందీ, పెళ్లి, రిసెప్షన్ అంటూ గ్రాండియర్‌గా ట్రైలర్ ఉంది. అలాగే ఫుల్ డ్రామా, ఎమోషన్స్, రొమాన్స్ కూడా తగుపాళ్లలో ఉన్నాయని అర్థమవుతోంది.
మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 1లో కనిపించిన నటీనటులే రెండో భాగంలోనూ కనిపించనున్నారు. శోభిత, అర్జున్ మాథూర్‌తో పాటు ఈసారి మృణాళ్ ఠాకూర్, కల్కి కొచ్లిన్, రాధికా ఆప్టే, శిబానీ దండేకర్, సారా జేన్ డయాస్, జిమ్ సర్బా, శశాంక్ అరోరా, శివాంగీ రస్తోగీ లాంటి ట్యాలెంటెడ్ నటీనటులు ఇందులో భాగమయ్యారు.
ఎక్సెల్ మీడియా, టైగర్ బేబీ సంయుక్తంగా నిర్మించిన మేడ్ ఇన్ హెవెన్ సిరీస్‌ను నిర్మించారు. అలాగే జోయా అక్తర్, రీమా కగ్టి, అలంకృత శ్రీవాస్తవ, నీరజ్, నిత్యా మెహ్రా దర్శకత్వం వహించారు. కాగా రెండో సీజన్ తెలుగు వెర్షన్ లోనూ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.
and once again, we find a newer, grander Made In Heaven beginning!#MadeInHeavenOnPrime S2, trailer out now!@madeinheaventv @sobhitaD #ArjunMathur @jimSarbh @kalkikanmani @ShashankSArora #ShivaniRaghuvanshi #MonaSingh @ActorVijayRaaz #TrinetraHaldar @IshwakSingh #ZoyaAkhtar pic.twitter.com/JL09eGGTrO
— prime video IN (@PrimeVideoIN) August 1, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..