2023 Web Series: ఎంటర్‌టైన్మెంట్‌ ఓవర్‌ డోస్‌.. ఈ ఏడాది ఓటీటీల్లో రిలీజ్ కానున్న ఆసక్తికర వెబ్‌ సిరీస్‌లివే

స్టార్‌ హీరోలు సైతం వీటిలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బడా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కూడా ఓటీటీలనే లక్ష్యంగా చేసుకుని సినిమాలను తెరకెక్కిస్తున్నారు. 2022లో ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

2023 Web Series: ఎంటర్‌టైన్మెంట్‌ ఓవర్‌ డోస్‌.. ఈ ఏడాది ఓటీటీల్లో రిలీజ్ కానున్న ఆసక్తికర వెబ్‌ సిరీస్‌లివే
2023 Web Series

Updated on: Jan 02, 2023 | 12:57 PM

ఎంటర్‌టైన్మెంట్ రంగంలో ప్రస్తుతం ఓటీటీల క్రేజ్‌ నడుస్తోంది. టీవీలు, థియేటర్లున్నా చాలామంది ఇప్పుడు డిజిటల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లకే తమ ఓటు వేస్తున్నారు. అందుకు తగ్గట్లే సరికొత్త కంటెంట్‌ తో సినిమాలు, వెబ్‌ సిరీస్‌లను అందిస్తున్నాయి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌. పైగా స్టార్‌ హీరోలు సైతం వీటిలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బడా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కూడా ఓటీటీలనే లక్ష్యంగా చేసుకుని సినిమాలను తెరకెక్కిస్తున్నారు. 2022లో ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇలా ఈ ఏడాది కూడా సరికొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు మూవీ లవర్స్‌ కు ముందుకు రానున్నాయి. అవేంటంటే..

ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3

మనోజ్ బాజ్‌పేయి ప్రధాన పాత్రలో వచ్చిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్‌లోని మొదటి రెండు భాగాలు సూపర్‌ డూపర్‌ హిట్ అయ్యాయి. ఈ సిరీస్‌లోని డైలాగులు, సన్నివేశాలు ఇప్పటికీ మీమ్స్‌, రీల్స్ వైరలవుతూనే ఉన్నాయి. ఇక రెండో భాగంలో సమంత నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఇప్పుడీ సిరీస్‌ లో మూడో భాగం రానుంది. అది కూడా ఈ ఏడాదే స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

మీర్జాపూర్ సీజన్ 3

పంకజ్ త్రిపాఠి వెబ్ సిరీస్ మీర్జాపూర్ మూడో సీజన్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ సిరీస్‌ మొదటి రెండు సీజన్లు విపరీతమైన ఆదరణ దక్కించుకున్నాయి. దీంతో ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కొత్త సీజన్ ఎప్పుడు వస్తుందా? అని అందరూ వేచి చూస్తున్నారు. ఇటీవలే మూడో సీజన్‌ షూటింగ్ పూర్తయినట్లు నటుడు ఫజల్‌ అలీ ప్రకటించాడు. త్వరలోనే మీర్జాపూర్ సీజన్‌ 3 రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేస్తున్నట్లు సమాచారం.

ఇవి కాకుండా ఫర్జి, షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 2, రాకెట్ బాయ్స్ సీజన్ 2 సిరీస్‌లు కూడా ఈ ఏడాదే విడుదల కానున్నాయి.

తెలుగులోనూ..

  •  పరంపర సీజన్‌ 3
  • రానానాయుడు
  • రెక్కీ సీజన్‌ 2
  • లూజర్‌ 3
  • ఝాన్సీ సీజన్‌ 2
  • 9 అవర్స్ సీజన్ 2

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.