
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం హాలీడే సీజన్ కొనసాగుతోంది. వరసగా వరలక్ష్మీ వ్రతం, రెండో శనివారం, ఆదివారం.. ఇలా వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో ఎంచెక్కా ఫ్యామీలీతో గడపవచ్చు. ఇక ఈ సెలవుల్లో మిమ్మల్ని ఎంటర్ టైన్ చేసేందుకు కొత్త సినిమాలు కూడా రెడీ అవుతున్నాయి. అయితే ఈ శుక్రవారం థియేటర్లలో పెద్ద సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. బకాసురతో పాటు సు ఫ్రమ్ సో అనే కన్నడ డబ్బింగ్ మూవీ థియేటర్లలోకి రానున్నాయి. అదే సమయంలో ఓటీటీలో మాత్రం 15కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన చిత్రాలు కూడా ఓటీటీల్లో అందుబాటులోకి రానున్నాయి. అలాగే హాలీవుడ్ మూవీస్ కూడా ఉన్నాయి. ఈ వారం ఓటీటీల్లో మోతెవరి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ ఆసక్తికరంగా కనిపిస్తోంది. తెలంగాణ కుర్రాడు అనిల్ జీల ఇందులో హీరోగా నటించాడు. వీటితో పాటు తెలుగమ్మాయి ఆనంది నటించిన అరేబియా కడలి కూడా స్ట్రీమింగ్ కు రానుంది. వీటితో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ కు రానున్నాయి. మరి ఆగస్టు మొదటి వారంలో ఏయే ఓటీటీల్లో ఏయే సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయో తెలుసుకుందాం రండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.