
ఎప్పటిలాగే ఈ శుక్రవారం పలు కొత్త సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఎనర్జిటిక్ స్టార్ పోతినేని రామ్ నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ ఈ వారం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అలాగే కీర్తి సురేశ్ ‘రివాల్వర్ రీటా’, ధనుష్ ‘అమర కావ్యం’ లాంటి పెద్ద సినిమాలపై కూడా మంచి అంచనాలున్నాయి. వీటితో పాటు అంధక, ఖైదు, స్కూల్ లైఫ్, మరువ తరమ తదితర చిన్న సినిమాలు కూడా థియేటర్లలో సందడి చేయనున్నాయి. మరోవైపు ఈ వారం ఓటీల్లోనూ పలు కొత్త సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. వీటిలో విష్ణు విశాల్ ఆర్యన్ కాస్త ఆసక్తిని కలిగిస్తోంది. అలాగే శశివదనే సినిమా కూడా ఒకసారి చూడచ్చు. ఇక రవితేజ, శ్రీలీలల మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ మాస్ జాతర కూడా ఈ వారమే స్ట్రీమింగ్ కు వచ్చే ఛాన్స్ ఉంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇవి కాకుండా స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ ఐదో సీజన్, జాన్వీ కపూర్ ‘సన్నీ సంస్కారీ కీ తులసి’ కూడా ఈ వారం ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. మరి నవంబర్ నాలుగో వారంలో వివిధ ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు,సిరీస్ లపై ఓ లుక్కేద్దాం రండి.
నెట్‌ఫ్లిక్స్
జీ5
సన్ నెక్స్ట్
ఆపిల్ టీవీ ప్లస్
లయన్స్ గేట్ ప్లే
Note: ఇవి కాక వారం కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లను ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.