ఓటీటీలు కూడా తగ్గదేలే అన్నట్లుగా సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఆడియెన్స్‌ను అలరించేందుకు రెడీ అయ్యాయి. ఈ వారం ప్రధానంగా అందరి దృష్టి మిస్టర్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాపైనే ఉంది. థియేటర్లలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు చాలామంది ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
Ad
OTT Movies
Follow us on
గత వారంతో పోలిస్తే ఈ వారం థియేటర్లలో భారీగా సినిమాలు రిలీజవుతున్నాయి. కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్, సుధీర్ బాబు మామా మశ్చీంద్ర, సిద్ధార్థ్ చిన్నా, స్వాతి మంత్ ఆఫ్ మధు వంటి ఆసక్తికర సినిమాలు సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయనున్నాయి. అయితే ఓటీటీలు కూడా తగ్గదేలే అన్నట్లుగా సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఆడియెన్స్‌ను అలరించేందుకు రెడీ అయ్యాయి. ఈ వారం ప్రధానంగా అందరి దృష్టి మిస్టర్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాపైనే ఉంది. థియేటర్లలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు చాలామంది ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. వీటితో పాటు మిస్టర్ ప్రెగ్నెంట్, బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ గదర్ 2 వంటి సినిమాలు ఓటీటీలోకి అందుబాటులోకి రానున్నాయి. అలాగే లోకి వంటి ఇంగ్లిష్ సిరీస్‌లు కూడా డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్నాయి. మరి మొత్తానికి ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్‌ల వివరాలేంటో తెలుసుకుందాం రండి.