OTT Movies: ఓటీటీ ఆడియెన్స్ గెట్ రెడీ.. ఈ వారం స్ట్రీమింగ్‌కు 20కు పైగా సినిమాలు, సిరీస్‌లు.. ఫుల్ లిస్ట్
ఈ వారం థియేటర్లలో పెద్ద సినిమాల సందడి ఉండనుంది. సూర్య కంగువా, వరుణ్ తేజ్ మట్కా వంటి ఆసక్తికరమైన సినిమాలు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ ఈ వారం మస్త్ ఎంటర్‌టైన్మెంట్ ఉండనుంది.
ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం ఈ వీక్ లో 20కు పైగానే సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. . వాటిలో ఎక్కువగా హిందీ, ఇంగ్లిష్ చిత్రాలే ఉన్నాయి. తెలుగు ఓటీటీ సినిమాలకు సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో అప్ డేట్స్ ఏమైనా రావొచ్చు. అయితే హిందీ, ఇంగ్లిష్ సినిమాల్లోనూ కొన్ని ఆసక్తికరంగా ఉన్నాయి. ఇవి దాదాపు తెలుగులోకి కూడా అందుబాటులోకి రానున్నాయి. మరి నవంబర్ రెండో వారంలో వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు రాబోతున్నసినిమాలు, సిరీస్ లేంటో ఒక లుక్కేద్దాం రండి.
ఆహా ఓటీటీ
అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే సీజన్ 4 (అల్లు అర్జున్ ఎపిసోడ్)- నవంబర్ 15