Lakshya In Aha: ఆహాలో అలరించనున్న లక్ష్య.. నేటినుంచే స్ట్రీమింగ్..!

|

Jan 07, 2022 | 12:09 PM

యువ నటుడు నాగశౌర్య ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం లక్ష్య.. నేటి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఆహాలో అలరించేందుకు సిద్ధమైన ఈ సినిమాను డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించాడు.

Lakshya In Aha: ఆహాలో అలరించనున్న లక్ష్య.. నేటినుంచే స్ట్రీమింగ్..!
Lakshya
Follow us on

Lakshya Streaming In Aha: యువ నటుడు నాగశౌర్య ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం లక్ష్య.. నేటి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఆహాలో అలరించేందుకు సిద్ధమైన ఈ సినిమాను డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్‌గా నటించింది. స్పోర్ట్స్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌గా వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా కోసం నాగశౌర్య విలు విద్యలో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడు. ‘లక్ష్య’లో నాగశౌర్య రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించి అలరించాడు.

అయితే తాజాగా ఈ సినిమా ప్రముఖ తొలి తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో జనవరి 7నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా ట్విట్టర్‌లో వెల్లడించింది. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

ఈ సినిమాకు కాళ భైరవ సంగీతాన్ని సమకూర్చారు. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫర్‌గా, జునైద్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే నాగశౌర్య నటించిన మరో సినిమా వరుడు కావలెను కూడా నేటి నుంచే జీ5లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఒకేరోజు నాగశౌర్య నటించిన రెండు సినిమాలు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి.

Also Read: Varudu Kaavalenu: ఓటీటీలో నాగశౌర్య ‘వరుడు కావలెను’.. నేటి నుంచే జీ5లో స్ట్రీమింగ్..!

Pushpa: బాక్సాఫీస్ దుమ్ముదులిపి.. ఓటీటీ లెక్కలు మార్చేందుకు సిద్ధమైన ‘పుష్ప’రాజ్.. అమెజాన్ ప్రైమ్‌లో నేటినుంచే..