Kudi Yedamaithe: కలలో ఏమి జరిగిందో.. ఎగ్జాక్ట్‌‌‌గా అదే జరుగుతోంది.. ఆకట్టుకుంటున్న కుడిఎడమైతే ట్రైలర్..

అమలాపాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కుడిఎడమైతే. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమలాపాల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుంది.

Kudi Yedamaithe: కలలో ఏమి జరిగిందో.. ఎగ్జాక్ట్‌‌‌గా అదే జరుగుతోంది.. ఆకట్టుకుంటున్న కుడిఎడమైతే ట్రైలర్..
Kudi Yedamaithe

Edited By: Anil kumar poka

Updated on: Jul 15, 2021 | 9:23 AM

అమలాపాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కుడిఎడమైతే. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమలాపాల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుంది. ‘బెజవాడ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై నటి అమలాపాల్ ఆ తర్వాత పలు విజయవంతమైన సినిమాల్లో నటించారు. ఈ అందాల తార ప్రస్తుతం వెబ్ సిరీస్‌లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్’ తెలుగు రీమేక్‌లో నటిస్తోన్న అమలా పాల్.. ఆహా ఓటీటీ వేదిక కోసం ‘కుడి ఎడమైతే’ అనే మరో తెలుగు వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నారు. అమలాపాల్ – రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలతో రూపొందిన ఈ సిరీస్ జూలై 16 నుండి స్ట్రీమింగ్ కానుంది. ‘లూసియా’ ‘యూ టర్న్’ ఫేమ్ పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ ని రామ్ విఘ్నేశ్ రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ – టీజర్ ఈ సిరీస్ పై ఆసక్తిని పెంచాయి. తాజాగా ఈ సిరీస్ నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ఇది కల అంటే నేనే నమ్మలేకపొతున్నాను.. కలలో ఏమి జరిగిందో.. ఎగ్జాక్ట్ గా అదే జరుగుతోంది అనే డైలాగ్ తో ట్రేలర్ ప్రారంభం అవుతుంది. ఈరోజు రిపీట్ అవుతోందని నాకు తప్ప ఇంకెవరికి తెలియదు అంటూ అమలాపాల్ చెప్పే డైలాగ్ ఆసక్తిగా అనిపించింది. నలుగురు పిల్లలను కిడ్నాప్ చేసిన ఓ క్రిమినల్ ను పట్టుకుకోడానికి అమలా పాల్ ట్రై చేస్తున్నట్లుగా ట్రైలర్ లో చూపించారు. మొత్తమీద ట్రైలర్ ఆకట్టుకుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు పవన్ కుమార్ స్టూడియోస్ సంస్థలు కలిసి ఈ సిరీస్ ని నిర్మించాయి.