Kudi Yedamaithe : ఇలా ఉంటే మనల్ని ఎవరు ప్రశ్నించరు.. ఆసక్తికరంగా అమలా పాల్ ఇంట్రడ్యూసింగ్ వీడియో..

ప్రస్తుత పరిస్థితులతోపాటు.. ట్రెండ్‏కు అనుగుణంగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ అందిస్తోంది తెలుగు ఓటీటీ మాధ్యమం "ఆహా".

Kudi Yedamaithe : ఇలా ఉంటే మనల్ని ఎవరు ప్రశ్నించరు.. ఆసక్తికరంగా అమలా పాల్ ఇంట్రడ్యూసింగ్ వీడియో..
Kudi Yedamaithe

Edited By: Rajitha Chanti

Updated on: Jul 10, 2021 | 12:36 PM

ప్రస్తుత పరిస్థితులతోపాటు.. ట్రెండ్‏కు అనుగుణంగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ అందిస్తోంది తెలుగు ఓటీటీ మాధ్యమం “ఆహా”. సూపర్ హిట్ సినిమలతోపాటు.. సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‏లను అందిస్తూ… తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది “ఆహా”. ఇతర డిజిటల్ షోలకు గట్టి పోటీనిస్తూ.. ఇంట్రెస్టింగ్ సిరీస్‏తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న “ఆహా” సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ “కుడి ఎడమైతే” ను త్వరలో స్ట్రీమింగ్ చేయనుంది. ఇందులో హీరోయిన్ అమలా పాల్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ‘లూసియా’, తెలుగులో ‘నాలో ఒకడు’… సమంత ‘యూటర్న్’ సినిమాలను డైరెక్ట్ చేసిన పవన్ కుమార్ ఈ చిత్రానికి తెరకెక్కించాడు.

గత కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్న అమలాపాల్.. ఇప్పుడు విభిన్న కథలను ఎంచుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఓ వైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే.. మరో వైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు ‘కుడి ఎడమైతే’ అనే సస్పెన్స్ థ్రిల్లర్‏ సినిమాతో రానున్నారు. ఇక ఈ సిరీస్‏లో అమలాపాల్ పోలీస్ ఆఫీసర్ దుర్గ పాత్రలో నటిస్తుండగా.. డెలివరీ బాయ్ ఆదిగా రాహుల్ విజయ్ నటిస్తున్నారు. ఈ సిరీస్ నుంచి పోలీస్ ఆఫీసర్ దుర్గ ఇంట్రడ్యూసింగ్ వీడియోను విడుదల చేశారు.

ఇక అమలాపాల్ పరిచయ వీడియో ఆసక్తిగా సాగింది. ఫిబ్రవరి 29.. నాలుగెళ్లకు ఒక్కసారి వస్తుంది. ఎవరు డిసైడ్ చేశారో కానీ.. అంటూ ప్రశ్నిస్తూ వీడియో మొదలవుతుంది. ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్‏లో పనిచేసే దుర్గ ఒంటరిగానే ఉంటుంది. కానీ..తనకు ఒంటరిగా ఉండడం ఇష్టమా.. రియాల్టీస్ నుంచి దూరంగా ఉండటానికి ఇలా ఉంటున్నానా ? అని తనను ప్రశ్నించుకుంటూ.. ఇలా ఉంటే ఎవరు మనల్ని ప్రశ్నంచరు అంటూ అమలాపాల్ చెప్పే డైలాగ్స్‏తో వీడియో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇందులో రవి ప్రకాష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఎమోషన్స్, థ్రిల్స్ కలిసిన ఈ లూప్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ జూలై 16న తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

పోలీస్ ఆఫీసర్ దుర్గా ఇంట్రడ్యూసింగ్ వీడియో..

Also Read: Viral Video: వామ్మో.. వెళ్తున్న కారుపై మెరుపు దాడి చేసిన పైథాన్.. ప్రయాణికులకు ఊహించని షాక్.. వైరల్ వీడియో