AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ప్రపంచంలో అత్యంత ఖరీదైన వెబ్ సిరీస్.. ఏకంగా రూ.8300 కోట్లతో..

'లార్డ్ ఆఫ్ ద రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్' అనే వెబ్ సిరీస్ 8300 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వెబ్ సిరీస్. ఒక్కో ఎపిసోడ్ బడ్జెట్ భారతీయ సినిమాలోని చాలా సినిమాల బడ్జెట్ కంటే ఎక్కువ. ఉదాహరణకు, 500 కోట్ల రూపాయల బడ్జెట్‌తో 'కల్కి 2898 AD' చిత్రం దానిలోని ఒక ఎపిసోడ్ బడ్జెట్‌కు సమానం.

OTT Movie: ప్రపంచంలో అత్యంత ఖరీదైన వెబ్ సిరీస్.. ఏకంగా రూ.8300 కోట్లతో..
The Lord Of The Rings
Rajitha Chanti
|

Updated on: Oct 27, 2024 | 7:43 AM

Share

కొన్నాళ్లుగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్‏కు ఆదరణ పెరుగుతున్న సంగతి తెలిసిందే. అలాగే వాటిలో సినిమాలతోపాటు వెబ్ సిరీస్‌లకు కూడా ప్రాధాన్యత పెరుగుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళీ, హిందీ భాషలలో ఇప్పటికే అనేక వెబ్ సిరీస్ వచ్చాయి. కానీ హాలీవుడ్ వెబ్ సిరీస్ గురించి చెప్కక్కర్లేదు. షులో ఇప్పటికే చాలా వెబ్ సిరీస్‌లు వచ్చాయి. భారత్ కంటే ముందే ఈ ట్రెండ్ స్టార్ట్ చేశారనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఆ వెబ్ సిరీసులు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అంతేకాదు.. ఇప్పుడు వెబ్ సిరీస్ నిర్మాణం కోసం భారీగానే ఖర్చు చేస్తున్నారు మేకర్స్. సినిమాలకు మించి భారీ బడ్జెట్‏తో సస్పెన్స్ థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీస్, హారర్ సిరీస్ లు రూపొందిస్తున్నారు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన సిరీస్ ఏది తెలుసా? దాని పేరు ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్’. దీని ఖరీదు 8,300 కోట్ల రూపాయలు. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్’ నిర్మాణానికి 3800 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు మేకర్స్. కేవలం 8 ఎపిసోడ్‌ల కోసమే ఇంత డబ్బు పెట్టుబడి పెట్టారు. అంటే ఒక్క ఎపిసోడ్ నిర్మాణానికి 480 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ‘స్టార్ వార్స్: ది ఫోర్స్ అవేకెన్స్’ సిరీస్ నిర్మాణానికి దాదాపు 3800 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్’ అనేది ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ చిత్రం స్పిన్-ఆఫ్. దీని కోసం ఒక దావా వేయాలి. అందుకు కూడా పెద్ద మొత్తంలోనే ఖర్చయింది. అలాగే ఈ సిరీస్ ప్రమోషన్స్ కోసం కూడా ఎక్కువగానే డబ్బులు ఖర్చు చేశారు.

అయితే ఇప్పడిప్పుడే భారతీయ చిత్రాలకు, వెబ్ సిరీస్‏లకు కూడా భారీగానే ఖర్చు చేస్తున్నారు మేకర్స్. ఒక్కో ఎపిసోడ్ కు.. నటీనటుల పారితోషికాలకు కూడా పెద్ద మొత్తంలోనే వెచ్చిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘కల్కి 2898 ఏడి’ చిత్రం బడ్జెట్ 600 కోట్ల రూపాయలు. అంటే, ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్’ సిరీస్ ఎపిసోడ్‌కి సమానామని అర్థం.

ఇది చదవండి :  Ram Charan: అప్పుడేమో క్యూట్‏గా.. ఇప్పుడేమో హాట్‏గా.. చరణ్ చెల్లిగా నటించిన ఈ బ్యూటీని ఇప్పుడు చూస్తే..

Tollywood: ఒక్క సినిమాతోనే సెన్సెషన్ అయిన నీలికళ్ల సుందరి.. అదృష్టం కలిసిరాని వయ్యారి.. ఎవరంటే..

Nadhiya : ద్యావుడా.. అందంలో తల్లిని మించిపోయిన కూతుళ్లు.. నదియా డాటర్స్ ఎంత అందంగా ఉన్నారో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.