Cinema : ఈ ఏడాది ఓటీటీలో ఎక్కువమంది చూసిన సినిమా ఇదే.. నెట్ ఫ్లిక్స్ లో దుమ్మురేపుతున్న మూవీ..
ప్రస్తుతం ఓటీటీలో సినిమాలు చూసేవారి సంఖ్య ఎక్కువగా ఉందన్న సంగతి తెలిసిందే. సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ డ్రామాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈక్రమంలోనే ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో ఒక సినిమాకు విపరీతమైన వ్యూస్ వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈసినిమాను తెగ చూస్తున్నారు.

ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో ఒక సినిమా దుమ్మురేపుతుంది. ఈ సినిమా షూటింగ్ కేవలం 8 నెలల్లోనే పూర్తైంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన నాన్-హాలీవుడ్ చిత్రాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. అది ఏ చిత్రమో మీకు తెలుసా? అదే ధురందర్. ఆదిత్య ధర్ దర్శకత్వంలో, రణవీర్ కపూర్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం గత సంవత్సరం చివర్లో విడుదలైంది. ఇందులో సారా అర్జున్ కథానాయికగా నటించగా, మాధవన్ కథానాయకుడిగా నటించారు. అక్షయ్ ఖన్నా ప్రతినాయకుడిగా నటించారు. సంజయ్ దత్ ఒక పోలీస్ అధికారి పాత్రను పోషించారు. ఈ చిత్రం విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంది. దీని కారణంగా, ఈ చిత్ర రెండవ భాగం 2026లో విడుదలైంది. ఈ రెండు భాగాలు కలిసి రూ. 3000 కోట్లకు పైగా వసూలు చేశాయి.
రెండు భాగాలు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలై సూపర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో, ఈ ఏడాది ఇప్పటివరకు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అత్యధికంగా వీక్షించిన భారతీయ చిత్రాల జాబితాలో ‘ధురందర్’ అగ్రస్థానంలో నిలిచింది. ఈ చిత్రానికి 3.7 కోట్ల వ్యూస్ లభించినట్లు సమాచారం. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో నెట్‌ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సరండోస్ మాట్లాడుతూ, ‘ధురందర్’ ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించిన ఆంగ్లేతర చిత్రంగా నిలిచిందని, అనేక ఆంగ్ల చిత్రాల కంటే ఎక్కువ వ్యూస్ సాధించి, అమెరికా ,యూకేల తర్వాత రెండవ స్థానంలో కొత్త శిఖరాలను చేరుకుందని అన్నారు.
ఈ ఏడాది మొదటి అర్ధభాగంలోనే ఈ సినిమా మొదటి భాగం 37 మిలియన్ల వ్యూస్ సాధించి, 22 దేశాల్లోని నెట్‌ఫ్లిక్స్ చార్టులలో అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. భారతదేశంలో రూ. 1,000 కోట్లు వసూలు చేసిన తొలి బాలీవుడ్ చిత్రంగా ‘ధురందర్: ది రివెంజ్’ రికార్డు సృష్టించింది.
