AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : 32 కోట్లతో తీస్తే రూ.450 కోట్ల కలెక్షన్స్.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..

రూ.32 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇప్పటికీ ఓటీటీలో దూసుకుపోతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలన ఈ సినిమా సంచలనం సృష్టించింది. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరెంటో తెలుసా.. ?

Cinema : 32 కోట్లతో తీస్తే రూ.450 కోట్ల కలెక్షన్స్.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
Andhadhun Movie
Rajitha Chanti
|

Updated on: Feb 21, 2026 | 6:56 AM

Share

కొన్ని సినిమాలు చాలా కాలంపాటు సినీప్రియుల హృదయాల్లో నిలిచిపోతాయి. ఎలాంటి హడావిడి లేకుండా విడుదలైన చిన్న చిత్రాలు ఊహించని విజయాన్ని అందుకుంటాయి. ఇక అవే సినిమాలు అటు ఓటీటీ ప్రపంచంలోనూ సత్తా చాటుతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ సైతం అలాంటిదే. ఈ సినిమా దాని ఉత్కంఠభరితమైన స్క్రీన్ ప్లే, మధ్యలో ఊహించలేని మలుపు, ఉత్కంఠభరితమైన క్లైమాక్స్ కారణంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను తెలుగులోనూ రీమేక్ చేశారు. కానీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అది ఏ సినిమానో మీకు తెలుసా? ఆ సినిమా పేరు అంధాధున్.

అంధాధున్.. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించారు. 2018లో థియేటర్లలో విడుదలైన ఈ మూవీలో ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టబు ప్రధాన పాత్రలు పోషించారు. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందించగా.. వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ నిర్మించింది. రూ. 32 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 450 కోట్లకు పైగా వసూలు చేసి మంచి ఆదరణ పొందింది. ఇదే చిత్రాన్ని తెలుగులో మాస్ట్రో పేరుతో రీమేక్ చేశారు. అందులో నితిన్, తమన్నా నటించారు. అయితే ఈ మూవీ మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది.

హిందీలో మాత్రం ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమాలో అత్యుత్తమ నటనకు గానూ ఆయుష్మాన్ ఖురానాకు జాతీయ అవార్డు లభించింది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది.

Follow Us
కేంద్రం కొత్త పథకం.. 300 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ..
కేంద్రం కొత్త పథకం.. 300 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ..
రోజూ తాగొచ్చి నరకం చూపిస్తున్న భర్త.. భార్య చేసిన పనికి ..
రోజూ తాగొచ్చి నరకం చూపిస్తున్న భర్త.. భార్య చేసిన పనికి ..
సంజూ శాంసన్ కెప్టెన్సీపై సెలెక్టర్ల మధ్య రచ్చ
సంజూ శాంసన్ కెప్టెన్సీపై సెలెక్టర్ల మధ్య రచ్చ
ప్లేట్ పట్టుకుని వెళ్తే అన్నం లేదు పో అన్నాడు.. ఇప్పుడు ఇలా..
ప్లేట్ పట్టుకుని వెళ్తే అన్నం లేదు పో అన్నాడు.. ఇప్పుడు ఇలా..
‏ 90's కుర్రాళ్లకు పిచ్చెక్కించిన సాంగ్.. ఇప్పటికీ యూట్యూ‏బ్‏లో..
‏ 90's కుర్రాళ్లకు పిచ్చెక్కించిన సాంగ్.. ఇప్పటికీ యూట్యూ‏బ్‏లో..
బీజేపీలో చేరే ముందు రజినీకాంత్ ఫోన్ చేసి బంపర్ ఆఫర్ ఇచ్చారు..
బీజేపీలో చేరే ముందు రజినీకాంత్ ఫోన్ చేసి బంపర్ ఆఫర్ ఇచ్చారు..
జింక పిల్లను పట్టిన ఆనందంలో మొసలి.. వెనక్కి తిరిగి చూస్తే..
జింక పిల్లను పట్టిన ఆనందంలో మొసలి.. వెనక్కి తిరిగి చూస్తే..
అల్లనేరేడు పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
అల్లనేరేడు పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
లక్ష్మీదేవి పూజలో పారిజాత పుష్పాల ప్రాముఖ్యత.. ఇంట్లో సిరుల పంట!
లక్ష్మీదేవి పూజలో పారిజాత పుష్పాల ప్రాముఖ్యత.. ఇంట్లో సిరుల పంట!
ఆసుపత్రిలో కలకలం.. గర్భిణి చనిపోయిన గంటల్లోనే 3 తులాల బంగారం మాయం
ఆసుపత్రిలో కలకలం.. గర్భిణి చనిపోయిన గంటల్లోనే 3 తులాల బంగారం మాయం