OTT Movie: 2 సీజన్స్.. 18 ఎపిసోడ్స్.. స్కామ్ పై నిర్మించిన సిరీస్.. లక్కీ భాస్కర్ సినిమాను మించిన ట్విస్టులు..

ప్రస్తుతం ఓటీటీలో ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు దూసుకుపోతున్నాయి. కానీ ఇప్పుడు అనుహ్యంగా ఒక సిరీస్ మాత్రం మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. స్కామ్ పై తీసిన ఈ సిరీస్ ఏకంగా 2 సీజన్స్.. 18 ఎపిసోడ్స్ కలిగి ఉంది. ప్రస్తుతం ఈ సిరీస్ సినీ ఓటీటీ ప్రియులను ఆకట్టుకుంటుంది. ఇంతకీ ఆ సిరీస్ ఏంటో తెలుసా.. ?

OTT Movie: 2 సీజన్స్.. 18 ఎపిసోడ్స్.. స్కామ్ పై నిర్మించిన సిరీస్.. లక్కీ భాస్కర్ సినిమాను మించిన ట్విస్టులు..
Jamtara Ott

Updated on: May 27, 2025 | 11:16 AM

ఓటీటీల్లో ఎప్పుడూ సినిమాలు, వెబ్ సిరీస్ లు చూడడం ఇష్టపడతారా.. ? అయితే ఈ వెబ్ సిరీస్ గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ఇందులోని ప్రతి సీన్ మిమ్మల్ని కదిలిస్తుంది. లక్కీ భాస్కర్ చిత్రంలో చూపించినట్లుగా హర్షద్ మెహతా, రైడ్ వంటి మోసాలకు సంబంధించిన సినిమాల కంటే.. ఈ సీజన్ మరింత ఆసక్తిగా ఉంటుంది. ఇప్పటివరకు రెండు సీజన్స్ కంప్లీట్ అయ్యాయి. ప్రతి సీజన్.. ప్రతి ఎపిసోడ్ ఆద్యంతం మిమ్మల్ని కట్టిపడేస్తాయి. ఇంతకీ ఆ సిరీస్ పేరెంటో తెలుసా.. ? అదే జమ్తారా. ప్రస్తుతం ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికీ ఈ సిరీస్ ఓటీటీలో సంచలనం సృష్టిస్తుంది.

జమ్తారా సిరీస్ లో ఆన్ లైన్ స్కామ్ అంటే ఫిషింగ్ గురించి చూపించారు. ఈ సిరీస్ స్పర్శ్ శ్రీవాస్తవను ఒక స్టార్ గా మార్చింది. ఈ సిరీస్ తర్వాత అతడికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. జమ్తారా అనేది జార్ఖండ్‌లోని ఒక చిన్న ప్రదేశం పేరు. దానిని ఫిషింగ్ హబ్ అని అంటారు. బ్యాంక్ నుంచి చేస్తున్నామని చెప్పి ఓటీపీ అడుగుతూ తరచూ నకిలీ కాల్స్ రావడం గురించి మీరు వినే ఉంటారు. కేవలం నాలుగు నంబర్స్ చెప్పడంతో మీ అకౌంట్ లో ఉండే లక్షల రూపాయాలు కాజేస్తారు. ఇప్పుడు ఇదే విషయాన్ని ఈ సిరీస్ లో అద్భుతంగా చూపించారు. కుంభకోణం గురించి అవగాహన కల్గిస్తుంది.

2020 నుంచి 2022 వరకు సాగిన ఈ సిరీస్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇందులో అమిత్ సియార్, దిబ్యేందు భట్టాచార్య, స్పార్ష్ శ్రీవాస్తవ, ఆసిఫ్ ఖాన్ కీలకపాత్రలు పోషించారు. సౌమ్యేంద్ర పాది రూపొందించిన ఈ క్రైమ్ డ్రామా సిరీస్ ఇప్పటికీ ఓటీటీలో దూసుకుపోతుంది. ఈ కథ ఫిషింగ్ రాకెట్ నడిపే కొంతమంది అబ్బాయిల చుట్టూ తిరుగుతుంది. ఈ కథ పూర్తిగా సస్పెన్స్, థ్రిల్లర్ ట్విస్టులతో సాగుతుంది.

ఇవి కూడా చదవండి :  

Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..

Megastar Chiranjeevi: అమ్మ బాబోయ్.. చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్‏ గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్ అవ్వాల్సిందే..

OTT Movie: బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ.. 3 కోట్లతో తీస్తే రూ.70 కోట్ల కలెక్షన్స్.. 2 గంటలు నాన్‏స్టాప్ సస్పెన్స్..

Actress: ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..