కరోనా సెకండ్ వేవ్ అనంతరం తెరుచుకున్న థియేటర్లలో మళ్లీ కాసుల వర్షం కురిపించిన సినిమా ఎస్ఆర్. కళ్యామ మండపం. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కోవిడ్ భయంతో థియేటర్లు రావడానికి ఆసక్తి చూపని ప్రేక్షకులకు తిరిగి థియేటర్స్ వైపు అడుగులు వేసేలా చేశాడు కిరణ్ అబ్బవరం. అటు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న తరుణంలో ఈ సినిమా థియేటర్లకు పూర్వ వైభవం తీసుకువచ్చింది. కరోనా సెకండ్ వేవ్ అనంతరం విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. రాజవారు రాణివారు సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం ఖాతాలో ఎస్ఆర్. కళ్యాణ మండపం భారీ సక్సెస్ ఇచ్చింది. ఇందులో కిరణ్ సరసన ప్రియాంక జవాల్కర్ నటించింది. ప్రమోద్ – రాజ్ నిర్మించిన ఈ సినిమాకి శ్రీధర్ దర్శకత్వం వహించాడు. సీనియర్ నటుడు సాయికుమార్ – తులసి కీలకమైన పాత్రలను పోషించారు.
విడుదలైన వారం రోజుల్లోనే ఈ మూవీ రూ. 7 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, మాటలను అందించింది కూడా కిరణ్ అబ్బవరమే. ఈ సినిమాలోని నటీనటులు అందరూ తమ నటనతో ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యారు. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ ఓటీటీ వేదికగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఈ మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థ కొనుగోలు చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు ఉన్న డిమాండ్‌ను మంచి బడ్జెట్ ఇచ్చి కొనుగోలు చేసినట్లుగా టాక్. ఆగస్ట్ 27న ఎస్ఆర్. కళ్యాణ మండపం సినిమాను స్ట్రీమ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఈ వారంలో వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంద. ఈ సినిమా విడుదలైన దాదాపు మూడు వారాల తర్వాత ఓటీటీలో విడుదల కాబోతున్నట్లుగా తెలుసా్తోంది. మొత్తానికి రాయలసీమ నేపథ్యంలో వచ్చిన ఎస్ఆర్. కళ్యాణ మండపం సినిమా మరోసారి ఓటీటీ వేదికగా ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేయనుంది. చూడాలి.. ఓటీటీలో ఈ మూవీ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
Also Read: Tharagathi Gadhi Daati: ఆహాలో సరికొత్త వినోదం.. తరగతి గది దాటి స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Rahul Sipligunj : రాహుల్ సిప్లిగంజ్ మీదికి ఎగబడ్డ జనాలు.. ఊకో కాకా అన్న ఊరుకోలేదు.. అసలేమైందంటే.