Raghu Thatha OTT: ఓటీటీలో దూసుకుపోతున్న కీర్తి సురేష్ ‘రఘు తాత’.. 24 గంట‌ల్లోనే సరికొత్త రికార్డ్..

న‌మ్మిన దాని కోసం నిల‌బ‌డే స్వ‌తంత్య్ర భావాలున్న అమ్మాయి పాత్ర‌లో కీర్తి సురేష్ మరోసారి అద్భుతమైన నటనతో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఫ్యామిలీ ఆడియెన్స్ అంద‌రూ క‌లిసి చూసే ఎమోష‌న‌ల్ మూవీగా అల‌రిస్తోంది. ఈ క్రమంలోనే విడుద‌లైన 24 గంట‌ల్లోనే ఈ చిత్రానికి 50 మిలియ‌న్ స్ట్రీమింగ్ రావ‌టం విశేషం.

Raghu Thatha OTT: ఓటీటీలో దూసుకుపోతున్న కీర్తి సురేష్ ‘రఘు తాత’.. 24 గంట‌ల్లోనే సరికొత్త రికార్డ్..
Raghu Thatha Movie

Updated on: Sep 16, 2024 | 10:54 AM

ప్రస్తుతం తెలుగు సినిమాలు కాకుండా హిందీ మూవీస్ పై ఫోకస్ పెట్టింది హీరోయిన్ కీర్తి సురేష్. కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆడపాదడపా చిత్రాలు చేస్తున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు హిందీలో వరుణ్ ధావన్ సరసన ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయిచే ఇటీవల మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రఘు తాత’. ఈ సినిమాను హోంబళే ఫిల్మ్స్ బ్యానర్ మీద విజయ్ కిరగందూర్ నిర్మించగా.. సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి ఆడియెన్స్ థియేటర్లో మంచి రెస్పాన్స్‌ను ఇచ్చారు. ఇప్పుడు సినిమాకు ఓటీటీలోనూ అదిరిపోయే రెస్పాన్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో దూసుకుపోతుంది. సెప్టెంబర్ 13 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. వైవిధ్య‌మైన పాత్ర‌లు, క‌థాంశంతో రూపొందిన ‘రఘు తాత’ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. న‌మ్మిన దాని కోసం నిల‌బ‌డే స్వ‌తంత్య్ర భావాలున్న అమ్మాయి పాత్ర‌లో కీర్తి సురేష్ మరోసారి అద్భుతమైన నటనతో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఫ్యామిలీ ఆడియెన్స్ అంద‌రూ క‌లిసి చూసే ఎమోష‌న‌ల్ మూవీగా అల‌రిస్తోంది. ఈ క్రమంలోనే విడుద‌లైన 24 గంట‌ల్లోనే ఈ చిత్రానికి 50 మిలియ‌న్ స్ట్రీమింగ్ రావ‌టం విశేషం.

రఘు తాత సినిమా ఆగస్ట్ 15న తమిళంలో థియేటర్లలో విడుదలైంది. పొలిటికల్ క్రైమ్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. 1960 బ్యాగ్ డ్రాప్ లో హిందీ వ్యతిరేక ఉద్యమం అనే రాజకీయ అంశం చుట్టూ కొనసాగుతూ ఉంటుంది. రాజకీయంతోపాటు ఈ మూవీలో లవ్ స్టోరీ కూడా ఉంటుంది. ఇందులో కీర్తితోపాటు ఎంఎస్ భాస్కర్, దేవదర్శిని, రవీంద్ర విజయ్, ఆనంద్ సామి, రాజీవ్ రవీంద్రనాథన్ కీలకపాత్రలు పోషించారు. తమిళంలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇక ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 మల్టీలింగ్వుల్ స్టోరీటెల్ల‌ర్‌గా ప్ర‌సిద్ధి పొందింది. ఎన్నో విభిన్నమైన సినిమాలు, వెబ్ సిరీస్ లతో మిలియ‌న్ల కొద్దీ అభిమానుల‌ను సంపాదించుకుంది. అత్య‌ద్భుత‌మైన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ గా పేరు తెచ్చుకుంది. 3,500 సినిమాల లైబ్ర‌రీ ఉన్న ప్లాట్‌ఫార్మ్ ఇది. 1,750 టీవీ షోలు, 700 ఒరిజిన‌ల్స్, 5 ల‌క్ష‌ల‌కు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ ఈ సంస్థ సొంతం. 12 భాష‌ల్లో (హిందీ, ఇంగ్లిష్‌, బెంగాలీ, మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళ్‌, మ‌రాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజ‌రాతీ, పంజాబీ)లో అందుబాటులో ఉంది.  ఇక ఇప్పుడు 24 గంట‌ల్లోనే 50 మిలియ‌న్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో ZEE5లో జోరు చూపిస్తోన్న మహానటి కీర్తి సురేష్ ‘రఘు తాత’.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.