నిఖిల్ హీరోగా చందదూ మొండేటీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కార్తికేయ 2. 2014లో వచ్చిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు సంచలనం సృష్టించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా అనూహ్య విజయాన్ని అందుకుంది. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్‌ను దక్కించుకుంది. ఏకంగా రూ. 100 కోట్లు రాబట్టి ఇండస్ట్రీ వర్గాలను సైతం విస్మయానికి గురి చేసింది. ఈ చిత్రంలో నిఖిల్‌కు జోడిగా అనుపమ పరమేశ్వరన్ నటించిన విషయం తెలిసిందే.
ఆగస్టు 14న విడుదలైన ఈ సినిమా తెలుగు స్థినిమా స్థాయిని మరోసారి జాతీయ స్థాయిలో చాటింది. ఇక వెండితెరపై వండర్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా డిజిటల్ స్క్రీన్‌పై కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటోంది. కార్తికేయ 2 అక్టోబర్ 5వ తేదీ నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో దూకుడు మీదుంది. థియేటర్స్‌లో సినిమా మిస్ అయిన వారు, మరోసారి ఓటీటీలో చూస్తోన్న వారితో కార్తికేయ2 స్ట్రీమింగ్ దూసుకుపోతోంది.
Did you hear this?? 100 Crore + streaming minutes in just 48 hours!!
You love it❤️
We love youu!!❤️Go WATCH #Karthikeya2OnZee5 again!https://t.co/gbvSmBkS5F@actor_Nikhil@anupamahere@Actorysr@harshachemudu@AnupamPKher#karthikeya2#ChoostuneUndipotaaru pic.twitter.com/HUdhjKKoVY
— ZEE5 Telugu (@ZEE5Telugu) October 7, 2022
ఈ సినిమాలో ఓటీటీలో విడుదలైన కేవలం రెండంటే రెండు రోజుల్లోనే ఏకంగా 100 కోట్లకుపై స్ట్రీమింగ్ నిమిషాలతో సంచలనం సృష్టించింది. ఈ విషయాన్ని జీ5 అధికారికంగా తెలిపింది. ఇంత తక్కువ సమయంలో అన్ని కోట్ల స్ట్రీమింగ్ నిమిషాలు సాధించి కార్తికేయ 2 సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇక ఈ సినిమాకు 3వ భాగం కూడా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు దర్శకుడు తెలిపిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ మొదలైంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..