Sathyam Sundaram OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి వచ్చేస్తోన్న సత్యం సుందరం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..
ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం సత్యం సుందరం. కార్తి, అరవింద్ స్వామి జంటగా నటించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ ప్లాట్ ఫామ్ అధికారికంగా ప్రకటించింది.
ఇటీవల దేవరకు పోటీగా వచ్చి డీసెంట్ హిట్ అందుకున్న సినిమా సత్యం సుందరం. కోలీవుడ్ స్టార్స్ కార్తి, అరవింద్ స్వామి ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా ఫీల్ గుడ్ మూవీగా అడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఈ చిత్రాన్ని హీరో సూర్య, జ్యోతిక అతి తక్కువ బడ్జెట్ లో నిర్మించినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ చిత్రాన్ని మంచి రివ్యూస్ వచ్చాయి. ఎప్పటిలాగే కార్తి, అరవింద్ స్వామి తమ నటనతో అడియన్స్ హృదయాలను కొల్లగొట్టారు. ఎలాంటి హడావిడి లేకుండా థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు అన్ని వర్గాల అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే థియేటర్లలో ఈ చిత్రానికి ఎక్కువగానే కలెక్షన్స్ వచ్చాయి. సెప్టెంబర్ 28న విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. నిజానికి ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కోసం మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో సినీ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది నెట్ ఫ్లిక్స్.
తమిళంలో 96 వంటి ఫీల్ గుడ్ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ సి. ప్రేమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సత్యం సుందరం ఈనెల 27 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్. తమిళంతోపాటు తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ భాషలలో ఈ సినిమాను అందుబాటులోకి తీసుకురానున్నారు.
సత్యం సుందరం సినిమాలో పాటలు ఎక్కువగా లేవు. అలాగే యాక్షన్ ఫైట్ సీన్స్ కూడా లేదు. కానీ ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునే సరికొత్త కంటెంట్. కథ అయితే చాలా నెమ్మదిగా కొనసాగుతుంది. ఎలాంటి ట్విస్టులు లేకుండా సుమారు 3 గంటలపాటు ప్రేక్షకులను దర్శకుడు మెప్పించాడు. ఈ సినిమా రూ.60 కోట్లకు పైగా రాబట్టింది.
ఇది చదవండి : Tollywood: వణుకుపుట్టించే థ్రిల్లర్ మూవీ.. ఈ సినిమాను అస్సలు మిస్సవద్దు..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.