Ardhamaindha arun kumar 2 Trailer: ఆకట్టుకుంటున్న అర్థమైంద అరుణ్ కుమార్ 2 ట్రైలర్..
కార్పోరేట్ జీవితంలోని ఒడిదుడుకులను ఓ అమాయకుడు ఎలా ఎదుర్కున్నాడు. అతను ఎలాంటి చిక్కుల్లో పడ్డాడు అనే కాన్సెప్ట్ తో ఈ సిరీస్ ను తెరకెక్కించారు. అర్థమైంద అరుణ్ కుమార్ సీజన్ 1 మంచి విజయం సాధించింది, ఆహా OTT ప్లాట్‌ఫారమ్‌లో సిరీస్ 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలతో ఆకట్టుకుంది ఈ సిరీస్.
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సూపర్ హిట్ సినిమాలతో పాటు ఆకట్టుకునే వెబ్ సిరీస్ లను కూడా అభిమానులకు అందిస్తుంది. ఇప్పటికే ఆహా నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలు, సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తాజాగా మరో ఆసక్తికర సిరీస్ కు సంబందించిన సీజన్ 2 ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది. అదే అర్థమైంద అరుణ్ కుమార్ సీజన్ 2. తాజాగా ఈ సిరీస్ కు సంబందించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ సిరీస్ అక్టోబర్ 31 న ప్రీమియర్ కానుంది.
Mathu Vadalara 2: రియా దొరికేసిందిరోయ్..! మత్తువదలరా 2 భామ మాములుగా లేదుగా..
కార్పోరేట్ జీవితంలోని ఒడిదుడుకులను ఓ అమాయకుడు ఎలా ఎదుర్కున్నాడు. అతను ఎలాంటి చిక్కుల్లో పడ్డాడు అనే కాన్సెప్ట్ తో ఈ సిరీస్ ను తెరకెక్కించారు. అర్థమైంద అరుణ్ కుమార్ సీజన్ 1 మంచి విజయం సాధించింది, ఆహా OTT ప్లాట్‌ఫారమ్‌లో సిరీస్ 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలతో ఆకట్టుకుంది ఈ సిరీస్. అర్థమైంద అరుణ్ కుమార్ సీజన్ 1లో ప్రధాన నటులు హర్షిత్ రెడ్డి, అనన్య శర్మ , తేజస్వి మదివాడ నటించారు. సీజన్ 2లో హర్షిత్ రెడ్డి స్థానంలో అర్జున్ టైటిల్ పాత్ర కోసం సిద్ధూ పవన్‌ని తీసుకున్నారు. ఈ సీజన్‌లో మరికొన్ని కొత్త పాత్రలు కూడా ఆకట్టుకోనున్నాయి.
ఇది కూడా చదవండి : Devara : ఇదెక్కడి మాస్ రా మావ.! దేవరలో నటించిన ఈమె బయట దుమ్మురేపుతోందిగా..!
కార్పోరేట్ ప్రపంచంలో వృత్తిని కొనసాగించేందుకు హైదరాబాద్‌కు మకాం మార్చిన అమలాపురంకు చెందిన అమాయకమైన యువకుడు అరుణ్ కుమార్ ప్రయాణాన్ని అర్థమైంద అరుణ్ కుమార్ లో చూపించనున్నారు. సీజన్ 2 ట్రైలర్‌లో, అరుణ్ కార్పోరేట్ ప్రపంచంలోని పరిస్థితులను నావిగేట్ చేయడం, ఈ ముగ్గురు అమ్మాయిలు అనన్య, షాలిని, కొత్త ఇంటర్న్ సోనియాతో కలిసి పని చేస్తూ అతను ఎలాంటి సవాళ్ళను ఎదుర్కున్నాడు. ? అనేది ఈ సిరీస్ లో చూపించనున్నారు. కాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సీజన్ 2 డైరెక్టర్ ఆదిత్య కెవి మాట్లాడుతూ, “సీజన్ 2 ప్రతి ఒక్కరి మొదటి ఉద్యోగ అనుభవం, ఆఫీస్ లో జరిగే రాజకీయాలు, అలాగే ఇంతగందరగోళల మధ్య తనను తాను వెతుక్కునే పోరాటాని చూపిస్తుంది. అరుణ్ ఎదుగుదలలో అతను ఈ సవాళ్లను ఎలా ధీటుగా ఎదుర్కొన్నాడు అనేది చూడొచ్చు.” ఇక ఈ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.
ఇది కూడా చదవండి : Tollywood: శ్రీదేవితో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? స్టార్ హీరోగారి భార్య కూడా ఆమె
ఆహా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.