
సాధారణంగా థియేటర్లలో రిలీజైన నెలరోజులకే సినిమాలు ఓటీటీలోకి వస్తుంటాయి. ఎంత పెద్ద హిట్ అయ్యినా 30 రోజులు లేకపోతే 40 రోజుల్లోపు అయినా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. అదే సమయంలో కొన్ని సినిమాలకు ఓటీటీ మోక్షం దొరకడం లేదు. కొన్ని సినిమాలైతే థియేటర్లలో రిలీజైన ఐదారు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్నాయి. అది కూడా ఎలాంటి ముందుస్తు ప్రకటన లేకుండానే. ప్రస్తుతం మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. గతేడాది డిసెంబర్ లో థియేటర్లలో రిలీజైందీ సినిమా. అయితే చిన్న సినిమా కావడం, పేరున్న నటీనటులు లేకపోవడం, పెద్దగా ప్రమోషన్లు నిర్వహించకపోవడంతో ఈ మూవీ ఎప్పుడు రిలీజైందో కూడా చాలా మందికి తెలియదు. అయితే హారర్ థ్రిల్లర్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీకి ఐఎండీబీలో టాప్ రేటింగ్ దక్కింది. అంటే అంతో ఇంతో కంటెంట్ ఉన్న మూవీనే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడీ సినిమా సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందుస్తు ప్రకటన లేకుండానే.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఓ యువకుడు లవ్ తో పాటు జీవితంలో కూడా ఫెయిల్ అవుతాడు . దీనితో మద్యానికి అలవాటు పడిపోతాడు. సరిగ్గా అదే సమయంలో అతనికి తన పూర్వీకులకు సంబంధించిన ఓ పురాతన గ్రంథం దొరుకుతుంది. ఆ పుస్తకం కారణంగా అతని జీవితంలో అనూహ్య మలుపులు చోటు చేసుకుంటాయి. మరి ఆ పుస్తకంలో ఉన్న మిస్టరీ ఏంటి? హీరోకే ఆ పుస్తకం ఎందుకు దొరికింది? చివరికి ఏమైంది? అన్నది తెలుసుకోవాలంటే కర్ణ పిశాచి సినిమా చూడాల్సిందే.
గతేడాది డిసెంబరు 27న ఈ ‘కర్ణ పిశాచి’ సినిమా థియేటర్లలో రిలీజైంది. విజయ్ మల్లాది తెరకెక్కించిన ఈ హారర్ థ్రిల్లర్ చిత్రాన్ని భరత్ సిగిరెడ్డి నిర్మించారు. ప్రణవి, రమ్యశ్రీ, నిఖిల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాని నిర్మించిన భరత్ సిగిరెడ్డి కూడా ఇందులో ఓ కీలక పాత్రలో నటించాడు. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇప్పుడు కేవలం అద్దె ప్రాతిపదికన మాత్రమే అందుబాటులో ఉంది.
Telugu film #KarnaPisachi (2024) by #VijayMalladi, now available for RENT on @PrimeVideoIN Store.
Ft. Yathirajyam Pranav, Ramya Sree, Nikhil Mangalampalli, Bharat Kumar Sigireddy, Eswar Rao Vanapalli, Muthyall Raav Ponnada and RK Naidu. pic.twitter.com/nIHFK8DsBd
— CinemaRare (@CinemaRareIN) May 10, 2025
SBK DREAM FILMS
Launch poster-5 of our titled film
🎭🎬KARNA PISACHI🎬📽
Directed By: VIJAY MALLADI
Cinematography: SANTHOSH DZ, VINEETH ARYA
Editing: NAGESH PK
Music: TARUN RANA PRATAP
Produced By: BHARAT SIGIREDDY pic.twitter.com/YR52sCA6mf— SBK DREAM FILMS (@DreamSbk) May 16, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.