OTT Movie: నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు.. ఓటీటీలో మతి పోగొట్టే క్రైమ్ థ్రిల్లర్.. IMDB టాప్ రేటింగ్ మూవీ

గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. విభిన్నమైన కథాంశంతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు మంచి కలెక్షన్లు రాబట్టింది. అంతేకాకుండా ఐఎమ్‌డీబీలోనూ పదికి 7.5 రేటింగ్ కూడా సొంతం చేసుకుందీ సినిమా.

OTT Movie: నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు.. ఓటీటీలో మతి పోగొట్టే క్రైమ్ థ్రిల్లర్.. IMDB టాప్ రేటింగ్ మూవీ
Bandook Movie

Updated on: Jan 17, 2026 | 7:41 PM

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. అలా శుక్రవారం (జనవరి 16) ఓ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది. గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆసక్తికరమైన కథాంశతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇక ఐఎమ్‌డీబీలోనూ ఈ చిత్రానికి 10కి 7.5 రేటింగ్ దక్కడం విశేషం. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక నిర్మానుష్యమైన నది ద్వీపంలో వరుసగా దారుణ హత్యలు జరుగుతాయి. హంతకులు పులి వేషాలు, జోకర్ గెటప్ తదితర కాస్ట్యూమ్స్‌లలో వచ్చి హత్యలు చేస్తుంటారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాలను వెలికతీయడానికి వెళతారు. విచారణ సమయంలో ఇన్వెస్టిగేషన్ బృందానికి సంచలన విషయాలు తెలుస్తాయి. అసలు ఈ వరుస హత్యల వెనక ఎవరున్నారు? ఈ మర్డర్స్ వెనక మోటివ్ ఏంటి? అన్న విషయాలు తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఆద్యంతం ఆసక్తికరమైన కథా కథనాలు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, ఊహించని ట్విస్టులతో సాగే ఈ సినిమా పేరు బందూక్. మహేష్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు ఆయనే కథ, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో  పార్థా, గోపాలకృష్ణ దేశ్‌పాండే, బాలాజీ మనోహర్, శ్వేతా ప్రసాద్, హరీష్ రాయ్, శంకర్ అశ్వత్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కేవలం కన్నడ భాషలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. కానీ ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి మూవీని ఎంజాయ్ చేయవచ్చు. వీకెండ్ లో మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూడాలనుకునేవారికి బందూక్ ఒక మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

లయన్స్ గేట్ ప్లేలో బంధూక్ స్ట్రీమింగ్..

ఓటీటీలోకి వచ్చేసిన మరిన్ని కొత్త సినిమాలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.