
ఎప్పటిలాగే ఈ శుక్రవారం ( అక్టోబర్ 17) పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. తెలుగు తో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ సినిమాలు, సిరీస్ లు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఒక కన్నడ సినిమా కూడా వచ్చింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. కొన్ని రోజుల క్రితమే కన్నడ నాట థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. గ్రిప్పింగ్ స్టోరీ లైన్, సస్పెన్స్, ట్విస్ట్ లతో సాగే ఈ సినిమా ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించింది. నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ఐఎమ్ డీబీలోనూ 9.2/10 రేటింగ్ దక్కడం విశేషం. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో ఈ సినిమా సాగుతుంది. హరీష్, రేవతి ప్రేమించుకుంటారు. హరీష్ క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తాడు. రేవతి బాగా డబ్బున్న ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. ఒక రోజు రాత్రి కలుసుకుని వీళ్లు ఎక్కడికైనా పారిపోదామనుకుంటారు.
ఇంతలో రేవతిని కలవడానికి బయల్దేరిన హరీష్ మధ్యలో హిట్ అండ్ రన్ కేసులో అరెస్ట్ అవుతాడు. మరోవైపు స్మగ్లర్ల కోసం అర్ధరాత్రి అడవిలో పోలీసులు గాలిస్తుంటారు. ఇంకో వైపు ఇంటి నుంచి వెళ్లిపోయిన రేవతి కోసం కుటుంబ సభ్యులు వెతుకుతుంటారు. ఇంతలో హరీష్ పోలీసుల కళ్లు గప్పి తప్పించుకుని పారిపోతాడు. మరి రేవతిని హరీష్ కలిశాడా? చివరకు ఏమైంది? అన్నది తెలుసుకోవలంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూడాల్సిందే. మూవీ చివర్లో వచ్చే ట్విస్ట్ మాత్రం నెక్ట్స్ లెవెల్ అని చెప్పవచ్చు.
The latest update reveals that #Elumale is now available for streaming on ZEE5 in Kannada audio along with English subtitles. pic.twitter.com/spLocWcPLb
— MOHIT_R.C (@Mohit_RC_91) October 17, 2025
కన్నడ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘ఏలుమలై’ శుక్రవారం (అక్టోబర్ 17న) ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా జీ5 ఓటీటీలో చూడటానికి అందుబాటులో ఉంది. ఈ సినిమాలో రానాతో పాటు ప్రియాంక కూడా కీలక పాత్రలు పోషించారు. జగపతి బాబు, కిషోర్ తదితరులు ప్రధాన పాత్రలో మెరిశారు. పునీత్ రంగస్వామి దర్శకత్వం వహించారు. ఇది ఒక రాత్రిలో జరిగే వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించబడిన కథ. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూడాలనుకునేవారికి ఇదొక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.