లోక నాయకుడు కమల్ హాసన్, సంచలన దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం భారతీయుడు. 1996లో రిలీజైన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషన్ సృష్టించింది. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్‌పై ఏఎం రత్నం నిర్మించిన ఈ సినిమాలో మనీషా కోయిరాల, ఊర్మిల మతోంద్కర్, సుకన్య తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను అప్పట్లో 15 కోట్ల రూపాయలతో నిర్మిస్తే ఏకంగా రూ. 50 కోట్ల కు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఇప్పుడు సుమారు రెండున్నర దశాబ్దాల తర్వాత భారతీయుడు సినిమాకు సీక్వెల్ వచ్చింది. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ తెలుగులో భారతీయుడు 2, తమిళంలో ఇండియన్ 2, హిందీలో హిందుస్థానీ 2 పేరుతో జూలై 12న విడుదలైంది. ఈ నేపథ్యంలో భారతీయుడు సినిమా ఫస్ట్ పార్ట్ కోసం చాలామంది ఓటీటీలో వెతికేస్తున్నారు. అలాంటి వారి కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ గుడ్ న్యూస్ చెప్పింది. సోమవారం (జులై 15) భారతీయుడు ఫస్ట్ పార్ట్ ను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు నెట్ ఫ్లిక్స్ ప్రకటించంది. ఈ కల్ట్ సినిమాకు భారీగా అభిమానులు ఉండటంతో మరోసారి ఓటీటీలో భారీ స్పందనను కూడగట్టుకొనే అవకాశం ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరోవైపు భారతీయుడు 2 చిత్రానికి పూర్తిగా మిక్స్‌డ్ టాక్ వస్తోంది. ఫస్ట్ పార్ట్ ఓ రేంజ్‌లో ఉందని, కానీ రెండో భాగం దాని దరిదాపుల్లోకి కూడా రాలేదని సినీ అభిమానులు, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. భారతీయుడు 2 సినిమాలో కమల్‌హాసన్‌తో పాటు రకుల్ ప్రీత్ సింగ్, నటుడు సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం, ప్రియా భవానీ శంకర్ తదితరులు నటించారు. అనిరుధ్ స్వరాలు సమకూర్చారు.
#Indian (1996) by @shankarshanmugh, streams on @NetflixIndia from July 15th. @ikamalhaasan @mkoirala @UrmilaMatondkar @arrahman pic.twitter.com/t7ZAkfk4xP
— CinemaRare (@CinemaRareIN) July 13, 2024
1996లో విడుదలైన భారతీయుడు సినిమాలోని సేనాపతి పాత్రనే ఈ సినిమాలోనూ కొనసాగించారు. అయితే కమల్ నటనకు మంచి పేరు వస్తున్నా సినిమా కు మాత్రం పూర్తిగా నెగెటివ్ టాక్ వస్తోంది. ఈ కారణంగానే సినిమాలోని సుమారు 20 నిమిషాల యాక్షన్ సీన్స్ ను కట్ చేశారు. ఆదివారం నుంచే కొత్త వెర్షన్ అందుబాటులోకి రానుంది.
Senapathy reigns supreme! 🤞 #Indian2 🇮🇳 is running successfully in cinemas. Join the revolution and witness the legacy! 🔥
INDIAN-2 🇮🇳 Running Successfully 🎬@IndianTheMovie 🇮🇳 Ulaganayagan @ikamalhaasan @shankarshanmugh #Siddharth @actorsimha @anirudhofficial @dop_ravivarman… pic.twitter.com/r1bWElkcvF
— Lyca Productions (@LycaProductions) July 13, 2024