Vikram: లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) నాలుగేళ్ల విరామం తర్వాత నటించిన చిత్రం విక్రమ్. లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి (Vijay Sethupathi), ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) కీలక పాత్రల్లో నటించారు. మరో కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య (Suriya) రోలెక్స్ పాత్రలో రప్ఫాడించాడు. గతనెల 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా చాలా విరామం తర్వాత సిల్వర్‌స్ర్కీన్‌పై ఎంట్రీ ఇచ్చిన కమల్‌ను చూసేందుకు అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎగబడ్డారు. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. తమిళ్‌తో పాటు అటు తెలుగు, హిందీ భాషల్లో కూడా మంచి ఆదరణ పొందింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం. ఇప్పటికీ థియేటర్లలో సందడి చేస్తోన్న ఈ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టింది.
He’s locked and loaded! Are you?#Vikram now streaming in Hindi, Tamil, Telugu, Malayalam and Kannada. #VikramOnDisneyPlusHotstar ??
ఇవి కూడా చదవండిWatch now: https://t.co/2UAQk3gUqw pic.twitter.com/zu6najgmPC
— Disney+ Hotstar (@DisneyPlusHS) July 7, 2022
నేటి నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విక్రమ్ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తమిళ్‌తో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది. మరి థియేటర్లలో కమల్ హంగామాను చూడలేని వారు ఎంచెక్కా ఇంట్లోనే ఓటీటీలో చూసి ఎంజాయ్ చెయ్యండి. కాగా ఈ చిత్రాన్ని రాజ్‌కమల్ బ్యానర్‌పై ఆర్ మహేందర్‌తో కలిసి కమల్ నిర్మించారు. ఇది ఆ బ్యానర్‌లో వచ్చిన 50వ సినిమా కావడం విశేషం. ఈ చిత్రంలో నరేన్, చెంబన్ వినోద్, కాళిదాస్ జయరామ్, గాయత్రి కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ సమకూర్చిన స్వరాలు, బీజీఏం ఓ రేంజ్‌లో పేలాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..