
క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే తెలుగుతో పాటు మిగతా భాషల్లో నూ ఇప్పుడు ఇవే జానర్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. మరీ ముఖ్యంగా ఓటీటీలో ఈ రకమైన సినిమాలకే ఎక్కువగా ఆదరణ ఉంటోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా క్రైమ్ థ్రిల్లర్ జానర్‌కు చెందినదే. ఇది ఒక కోలీవుడ్ సైకో థ్రిల్లర్ మూవీ. గతంలో తమిళంలో వచ్చిన రాక్షసన్, పోర్ తొళిల్ సినిమాలకు ఏ మాత్రం తీసి పోదు. సినిమా కథ విషయానికి వస్తే.. ఇందులో ఒక సైకో కిల్లర్ నగరంలో అనేక మంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి అత్యంత పాశవికంగా హత్య చేసి తప్పించుకు తిరుగు తుంటాడు. అదే సమయంలో ధైర్యం, మొండితనం ఉన్న సిన్సియర్ పోలీసాఫీసర్ అయిన హీరోకు ఈ సైకో కిల్లర్ పట్టుకునే బాధ్యతలు అప్పగిస్తారు. రంగంలోకి దిగిన హీరో ఎట్టకేలకు సైకో కిల్లర్ ను పట్టుకుంటాడు. కానీ అనుకోకుండా తన తోట ఉద్యోగులైన స్నేహితుడి ప్రాణాలను కోల్పోతాడు. దీంతో డిప్రెషన్ బారిన పడిన హీరో డిపార్ట్‌మెంట్ నుంచి తప్పుకొంటాడు. తన స్నేహితుడి చెల్లెలిని వివాహం చేసుకుని కాఫీ షాప్ ఓపెన్ చూసుకుంటుంటాడు. అయితే జైలు నుంచి తప్పించుకున్న సైకో కిల్లర్ మునపటి పనుల్నే కొనసాగిస్తాడు.
నగరంలో అమ్మాయిల దారుణ హత్యకు గురవుతారు. అయితే ఈసారి సైకో కిల్లర్ ఏకంగా హీరో ఫ్యామిలీనే టార్గెట్ చేస్తాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది?సైకో కిల్లర్ పట్టుకునేందుకు హీరో ఏం చేశాడు? ఈ క్రమంలో అతనికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అన్నది తెలుసుకోవాలంటే ఇరైవన్ (తెలుగులో గాడ్) సినిమా చూడాల్సిందే. ఐ అహ్మద్ తెరకెక్కించిన ఈ సినిమా 2023లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. జయం రవి, నయన తార ప్రధాన పాత్రలు పోషించారు. స్మైలింగ్ కిల్లర్ గా బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్ నటించాడు. స్టోరీ చదువుతుంటేనే చూసేలా అనిపిస్తున్న ఈ సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారం ‘నెట్‌ఫ్లిక్స్’లో అందుబాటులో ఉంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూడాలనుకువారికి గాడ్ సినిమా ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
#Iraivan (Tamil|2023)
Could been better. But lacks the thrill.A Messed up Psycho Thriller. Jayam Ravi is just blahh..Rahul Bose ok. Narration is not gripping at all. No Thrills/Emotions. Even after revealing d killer, film runs for 45+ Mins which tests Patience DISAPPOINTMENT! pic.twitter.com/M2rooog2aw
— Djinn (@Djinnn666) September 14, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.